రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఏఆర్ టి సెంటర్, రాజమండ్రి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఏఆర్ సెంటర్ సిబ్బంది వారిచే హెపటైటిస్-బి వాక్సిన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని డి ఏం హెచ్ ఓ డా॥ కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్టి మందులు వాడుతున్న పేషెంట్లకు ఈ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించి అవగాహన కల్పించడం జరగాలని తెలిపారు. అదే విధంగా హెపటైటిస్ వ్యాధి యొక్క లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, హెపటైటిస్ టీకా యొక్క ప్రాముఖ్యతను గురించి ఏఆర్టీ పేషెంట్లకు వివరించటం జరిగింది.
హెపటైటిస్ B వ్యాధి లక్షణాలు -ఆకలి లేకపోవడం
-వాంతులు అవడం
-నీరసంగా ఉండడం
-తరచుగా జ్వరం రావడం వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకొని వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 231 మంది ఏఆర్టీ పేషెంట్లకు హెపటైటిస్-బి టీకాను వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్డీ సెంటర్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డా|| యు.జె. కిరణ్, మెడికల్ ఆఫీసర్లు డా॥ వెంకట కృష్ణ, డా॥ శిలా, సిబ్బంది పాల్గొనటం జరిగింది.
Prajavartha Online Telugu News