Breaking News

నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేయాలి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-నగర డిప్యూటీ మేయర్ తో కలిసి అభివృద్ధి పనుల పర్యవేక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ తోటవారి వీధిలో రూ. కోటి వ్యయంతో చేపట్టిన 14 బీటీ రోడ్ల నిర్మాణ పనులను నగర మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో.. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ఈ ప్రభుత్వం బాధ్యతను తీసుకుందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ.. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. పనుల్లో జాప్యం జరగకుండా త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాంత అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు చూపుతున్న చొరవకు గానూ పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారంతోనే సెంట్రల్ ప్రాంత అభివృద్ధి సాధ్యపడిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానికులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *