Breaking News

జూనియర్ న్యాయవాదులకు వరంగా మారిన డా.వైఎస్సార్ లా నేస్తం

-డా.వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాల ద్వారా ఆపన్న హస్తం అందిస్తున్న ప్రభుత్వం
-కోవిడ్ విపత్తులో సైతం జూనియర్ న్యాయవాదులను, న్యాయవాదులు ఎంతగానో ఆదుకున్న ఈరెండు పథకాలు
-డా.వైఎస్సార్ లా నేస్తం ద్వారా గత మూడున్నర్రేళ్లలో రూ.34.39 కోట్లతో 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు లబ్ది
-న్యాయవాదుల సంక్షేమ నిధి పథకం ద్వారా గత మూడున్నర్రేళ్లలో 7,733 న్యాయవాదులకు రూ.25 కోట్లు విడుదల
-ప్రభుత్వ లీగల్, లెజిస్లేటివ్ ఎఫైర్స్ మరియు న్యాయ సెక్రటరీ జి.సత్యప్రభాకర రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డా.వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు, న్యాయవాదులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయని ప్రభుత్వ లీగల్, లెజిస్లేటివ్ ఎఫైర్స్ మరియు న్యాయ సెక్రటరీ జి.సత్యప్రభాకర రావు పేర్కొన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ విత్తుల్లో కూడా ఈ రెండు పథకాలు రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులను, న్యాయవాదులను ఎంతగానో ఆదుకున్నాయని ఆయన అన్నారు. మంగళవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులను, న్యాయవాదులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డా.వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు ఏ విధంగా ఆదుకుంటున్నాయో ఆయన వివరించారు.

జూనియర్ న్యాయవాదులకు వరంగా మారిన డా.వైఎస్సార్ లా నేస్తం…
నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డా.వైఎస్సార్ లా నేస్తం పథకం ఒక వరంగా మారిందని ప్రభుత్వ లీగల్, లెజిస్లేటివ్ ఎఫైర్స్ మరియు న్యాయ సెక్రటరీ జి.సత్యప్రభాకర రావు అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో న్యాయవాద వృత్తిలో నూతనంగా ప్రవేశించిన వారు ఆ వృత్తిలో నిలద్రొక్కుకోవడం చాలా కష్టమని, అయితే డా.వైఎస్సార్ లా సేన్తం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న నెలవారీ రూ.5000/- ల స్టైఫండ్ వారిని ఎంతగానో ఆదుకోవడమే కాకుండా ఆ వృత్తిలో వారు నిలద్రొక్కుకునేలా చేయూతను అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. 2019 లో శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నవరత్నాల పథకాలు అమల్లో భాగంగా డా.వైఎస్సార్ లా సేన్తం పథకం అమలుకు శ్రీకారం చుడుతూ 2019 అక్టోబరు 26 న జి.ఓ.ఎంఎస్.నెం.75 ను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ జి.ఓ.లో నిర్థేశించిన నియమ నిబంధల మేరకు నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జూనియర్ న్యాయవాదులకు మూడు సంవత్సరాల పాటు (35 సంవత్సరాల లోపు వారికి) నెలకు రూ.5000/- ల చొప్పున స్టైఫండ్ మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం అమల్లో ఎంతో పారదర్శకంగా వ్యవహరించడం జరుగుచున్నదని, ఇ-ప్రగతి నోడల్ ఏజన్సీ ద్వారా గుర్తించిన అర్హులైన జూనియర్ న్యాయవాదులకు మాత్రమే ఈ స్టైఫండ్ ను మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. 2019-20 మరియు 2020-21 లో సంభవించిన కోవిడ్ విపత్తుల్లో వర్చ్యువల్ గా కోర్టుల్లో హియరింగ్ జరగడం వల్ల జూనియర్ న్యాయవ్యాదులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారన్నారు. అయితే అటు వంటి విప్తతులో కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న డా.వైఎస్సార్ లా సేస్తం పథకం రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులను ఎంతగానో ఆదుకుందన్నారు. ఈ పథకం ద్వారా గత మూడున్నర్రేళ్లలో రూ.34.39 కోట్లను నెలకు రూ.5000/- ల చొప్పున స్టైఫండ్ రూపేణా మొత్తం 65,537 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ఇతోధికంగా మేలు జరుగుచున్నట్లు ఆయన తెలిపారు.

న్యాయవాదులకు చేయూతనిస్తున్న న్యాయవాదుల సంక్షేమ నిధి…
నవరత్నాలు పథకాల అమల్లో భాగంగా న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్ల కార్పస్ నిధితో న్యాయవాదుల సంక్షేమ నిధిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అడ్వొకేట్ జనరల్ చైర్మన్ గా, ఆర్థిక శాఖ ప్రిన్సఫల్ సెక్రటరీ ట్రస్టీగా, లా సెక్రటరీ మేనేజింగ్ ట్రస్టీగా మరియు ఏ.పి.బార్ కౌన్సిల్ నుండి నలుగురు సభ్యులుగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ట్రస్టు ద్వారా అర్హతమేరకు న్యాయవాదుల వైద్య ఖర్చులకు, మేజర్ ఆపరేషన్లకు, ఎల్.ఐ.సి. గ్రూప్ ఇన్సూరెన్సుకు మరియు లా పుస్తకాలు కొనుగోలుకు మరియు ఇతర అత్యవరసరాలకు ఈ నిధులను మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకూ 7,733 మంది న్యాయవాదులకు లబ్దిచేకూర్చే విధంగా రూ.25.00 కోట్లను విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పథకానికి వయో పరిమితి ఏమీ లేదని, న్యాయవాదుల అత్యవసరాలకు ఈ నిధులను విడుదల చేయడం జరుగుచున్నదని ఆయన తెలిపారు.
ఈ రెండు పథకాల వల్ల జూనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు ఎంతగానో మేలు పొందుతున్నారని, ప్రత్యేకించి కోవిడ్ విపత్తుల్లో ఈ రెండు పథకాలు జూనియర్ న్యాయవాదులను, న్యాయవాదులను ఎంతగానో ఆదుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *