Breaking News

ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యం

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 4.16 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. 58వ డివిజన్ వై.వి.రావు ఎస్టేట్స్ నందు రూ. 4.16 కోట్ల వ్యయంతో 1,500KL రిజర్వాయర్ నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డిలతో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో నగరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండేదని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సమస్యను అధిగమించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి మూడు వైపులా వై.వి.ఎస్టేట్., దావుబుచ్చయ్యకాలనీ., గుణదలలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వై.వి.రావు ఎస్టేట్ కు సంబంధించి రూ. 3.30 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు., రూ. 86.49 లక్షల వీఎంసీ సాధారణ నిధులతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించడం జరిగిందన్నారు. దీని ద్వారా వై.వి.ఎస్టేట్ నుంచి ఇందిరానాయక్ నగర్ వరకు పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే నీటి సరఫరా త్వరితంగా జరిగే విధంగా 20 మీటర్ల ఎత్తులో ట్యాంకును నిర్మిస్తున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. ఇప్పటికే రూ.3.61 కోట్ల 15 వ ఆర్ధిక సంఘం నిధులతో నీటి సరఫరా పంపింగ్ మెయిన్ లైన్ పనులు పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయితే శివారు ప్రాంతాలలోని చివరి ఇంటి వరకు దాదాపు 20 వేల మంది జనాభాకు త్రాగునీరు సమస్య తీరుతుందన్నారు. అలాగే వాంబేకాలనీలో రూ. 77 కోట్ల నిధులతో 5MGD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. మరో సంవత్సర కాలంలో ప్రజలకు కావలసిన ప్రతిఒక్క మౌలిక సదుపాయాన్ని పూర్తిస్థాయిలో కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఈ(ఇంజనీరింగ్) ప్రభాకర్, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్లూరి నాగేశ్వరరావు, సెక్రటరీ విజయసారథి, వీఎంసీ సిబ్బంది, కాలనీవాసులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *