-టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించిన మహిళ కమిషన్,
-నిరంతర గస్తీ పోలీస్ పికేట్ ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ కు అదేశాలు….
-పార్టీ జెండా చూపి, మీ పార్టీ వెనుక వుందని చెప్పి అఘాయిత్యాలు, అకృత్యాలు పాల్పడుతున్నవారిపై తెలుగుదేశం పార్టీ స్పందించాలి…..
-వినోద్ జైన్ వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మట్లాడలేదు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓ వివాహితను ఈవ్‌టీజింగ్ చేయడమే కాకుండా ఆమెపై చాకుతో ఇష్టానుసారంగా టీడీపీకి చెందిన అన్నదమ్ములు దాడి చేసిన ఘటన విజయవాడ వించిపేటలో జరిగింది.. సోమవారం ఉదయం – మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మబాధితురాలు ఇంటికి చేరుకొని ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ప్రాంతంలో నిరంతర గస్తీ పోలీస్ పికేట్ ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ ను అదేశించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘నరేష్’ అనే వ్యక్తి పట్ట పగలు ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రతి రోజు రోడ్డు మీద నువ్వు నాకు లొంగిపోతావా? లేదా? అని వేధిస్తుంటే ఆ అమ్మాయి భరించలేక చివరికి ఒక రోజు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఆమె ఇంట్లో వాళ్ళకు చెప్పుకుంది. భర్తకు, అత్తకు, మామకు నన్నిట్లా రోజు రోడ్డు మీద వేధిస్తున్నాడు అని చెబితే, వాళ్ళు వడ్డాది రమణ డివిజన్ తెలుగు దేశం పార్టీ నాయకుడి అని చెబుతున్న అతని తమ్ముడు నరేష్ ఇంటికి వెళ్లి ఇది సరైనదేనా అని అడిగినందుకు, వాళ్ళు మొత్తం కలిసి రాత్రి బాధితురాలి ఇంటిపై దాడి చేశారు, రాళ్లతోటి, లైట్లు పగలకొట్టి, కత్తుల తోటి ఆ అమ్మాయిని చంపబోయారు, గొంతు మీద కట్టి పెట్టబోతే అత్తా గారు అడ్డువెళ్ళింది ఆమె చెయ్యి నరికారు.
అదే విధంగా ఇంకా ఇద్దరు ముగురికి కూడా చేతులు కాళ్ళు నరికి ఇవాళ వాళ్ళు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత న్యాయమైన విషయం, మనం సినిమా చూస్తున్నామా? లేక ఇది విజయవాడ నగరమా? అనే సంగతి మనకు అర్ధం కానటువంటి పరిస్థితి. కాల్ మనీ, సెక్స్ రాకెట్ విషయంలో చాలా ఆగడాలు జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు వుండి ఈ దందాని నడిపిస్తున్నారు అని చెప్పి ఈ విజయవాడ నగరానికి సంబంధించినటువంటి యొక్క ప్రక్షాళన జరగాల్సిన అవసరం వుందని ఆ రోజు మేము మాట్లాడాము. ఈ రోజున అధికారంలో లేకపోయినప్పటికీ కూడా రౌడీయిజం ముసుగులో కుటుంబాలతో ఆడుకుంటున్నారు. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు అనేక సంఘటనలు వున్నాయని ఇక్కడకు వచ్చినటువంటి అనేకులు ఈ ప్రాంతంలో చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి MLA వెలంపల్లికి, కార్పొరేటర్ కి అందరి కుటుంబాలు బయటకు వచ్చి చెబుతున్నాయి, మా కోడల్ని ఇట్లా ట్రాప్ చేశారు అని, లేకపోతే మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు అని, మీము బయటికి చెప్పుకోలేకపోతున్నాము అని అనేటటువంటిది, అంటే ఆడపిల్లల విషయం కాబట్టి వీళ్ళు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడ కుటుంబం పరువు పోతుందో అని, వాళ్ళు ఇంకేంచేస్తారో అని, ఫోన్లతో సోషల్ మీడియాలో ఏమి దుష్ప్రచారం చేస్తారో అనేటటువంటి భయంతో కంప్లయింట్ కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు. ఇవ్వాళ ఈ గూండాయిజానికి పుల్-స్టాప్ పడాల్సిన అవసరం వుంది. ఈ ప్రాంతంలో మహిళలు కనీసం బయట తిరగాలన్నా, లేకపోతే వాళ్ళ కన్నుపడితే ఏమైపోతుందో అనేటటువంటి ఆందోళన! ఇది ఏ కాలం అని అడుగుతున్నాను. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెబుతున్నటువంటి ఈ కాలంలో ఈ రోజున మనం రాజుల కాలంలో వున్నట్లుగా వీళ్ళను ఎదో ఆడపిల్లని కంట పడనివ్వకుండా దాచాల్సిన పరిస్థితి, వాళ్ళు మీద చెయ్యి వేస్తే ఇంక మాట్లాడకూడదు అనే పరిస్థితి, వాళ్ళు రమ్మంటే రావాలా? నిన్ను కోరుకుంటున్నాను అని అంటే మహిళలు దాన్ని అంగీకరించాలి, తిరస్కరించకూడదు అనేటటువంటి పరిస్థితి, ఏమి రాజ్యం ఇది అని అడుగుతున్నాను. తెలుగు దేశం పార్టీ దీన్ని పెంచిపోషించాలని అనుకుంటుందా? విజయవాడ నగరంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నుండైన గుణపాఠాలు నేర్చుకోలేదు.. సామాన్యులైన పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వాళ్లు, వాళ్ళు ఈ రౌడీయిజo ముందు నిలబడాలంటే బాధితులకు ఎంత ధైర్యం వుండాలి, ఈ రోజున ఆ కుటుంబం ధైర్యంగా ముoదుకు వచ్చింది. ఎవరైనా సరే ఇలాంటి దౌర్జన్యాలకు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ పికెట్ ని ఈ ప్రాంతలో ఏర్పాటు చెయ్యాలని కూడా పోలీస్ కమిషనర్ గారితో ఇప్పుడే మాట్లాడటం జరిగింది. మహిళలకు పూర్తి భద్రతగా వుండటానికి అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ కుటుంబానికి అండగా ఉంటాము. ఏదో కేసే కదా బయటకు వస్తాము కదా మళ్ళీ మీ అంతుచూస్తాము అనేటటువంటి బెదిరింపులు చెయ్యదలచుకుంటే తాటతీస్తాము…అని చెబుతున్నాము. ఆడపిల్లల జోలికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్లుగా రౌడీయిజం చేస్తాము అంటే చూస్తూ ఊరుకోడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. ఈ కుటుంబానికి అండగా వుండడంతో పాటు, బాధ్యులందరినీ అరెస్ట్ చేశారు. కఠినమైన హత్యాయత్నంతో పాటు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుంది. వాళ్ళకు కఠినమైన శిక్ష పడటానికి పూర్తి చర్యలు తీసుకుంటాము. అంతేకాక ఈ ప్రాంతంలో మహిళల రక్షణకు సంబంధించి ఇక ముందు భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఒక నిరంతర గస్తీ వుండేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఒక వేళ పోలీస్ వైఫల్యం వుంటే దానిపైన కూడా చర్యలు వుంటాయి. ఒక రౌడీ షీటర్ లేకపొతే ఇట్లాంటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వారిని విజయవాడ రోడ్డులో ఇలా వదిలేస్తున్నాము అంటే తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులను ఇట్లా అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల్లోకి వదిలేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? ఈ రోజు జరిగిన సంఘటనలో ఎందుకు మీరు స్పందించలేదు? విజయవాడ నగరంలో ఒక 14 ఏళ్ళ అమ్మాయి ప్రాణాలను బలిగొన్నటువంటి నాయకుడి మీద మాట్లాడకపోవడంతో ఇవాళ అట్లాంటి వారు అనేకమంది చెలరేగిపోతున్నారు. ఇవాళ ఈ సంఘటన మీద సాక్ష్యాత్తు చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సినటువంటి అవసరం వుంది, ఎందుకంటే మీ పార్టీ జెండా చూపి, మీ పార్టీ వెనుక వుందని చెప్పి ఇంత అఘాయిత్యాలు, అకృత్యాలు ఇక్కడ జరుగుతూవున్నాయి. మీకు సంబంధం లేదు ఒక సస్పెన్షన్ లేకపోతె ఒక చిన్న ప్రెస్ నోట్ తో ఇది తీరిపోదు. మీ అండ చూసుకొని అనేక కుటుంబాలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు బయటకు రాని చాలా కధలు ఇంకా వున్నాయి ఇక్కడ. అనేక కుటుంబాలు కుమిలి పోతున్నాయి ఇక్కడ. దీని మీద మాట్లాడకుండా, విజయవాడ మీద దీనికి సంబంధించిన ఒక ప్రక్షాళన మీ పార్టీవైపు నుండి జరపకుండా, ఇవ్వాళ ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడటంలో అర్ధం లేదు. కాబట్టి ముందుగా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నాము. పోలీస్ వైఫల్యం లేకపొతే మరొక వైఫల్యం వుందంటే దానిపైన కూడా ఖచ్చితంగా మాట్లాడతాం, సమీక్షిస్తాo. ఏదైనా భవిష్యత్తుతో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరం కలిసి ఒక ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఆడపిల్లలకు ధైర్యంగా వుండేటటువంటి ఒక పరిస్థితి రావాలి, అదీ మనం ఎవరైనా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరూ ముందుకు రావడం లేదు, భయపడుతున్నారు కాబట్టి రౌడీయిజానికి భయపడుతున్నారు కాబట్టి మమ్మల్ని ఎవరూ ఏమి చెయ్యలేరు అని బాధ్యులు చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ రోజు ఈ అమ్మాయి బయటకు వచ్చింది ఈ కుటుంబం బయటకు వచ్చింది ఆ అమ్మాయికి అండగా ఆమె కుటుంబసభ్యలoదరు కూడా బయటకు వచ్చారు వెంటనే చర్యలు తీసుకున్నారు, బాధ్యులను అరెస్ట్ చేశారు. రౌడీలను ఎవరూ వెనకేసుకొనిరారు. ఖచ్చితంగా దీనిపై ఈ ప్రాంతంలో ఈ ఏరియా మీద ఒక నిఘా అనేది అవసరం. చిన్న చిన్న రౌడీలే కదా అని అనుకుంటే వాళ్ళు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ వుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చాలా కఠినoగా వ్యవహరిస్తాం. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు బాధితురాలు ఇంటికి చేరుకొని ఆమెను పరామర్శించారు.
Prajavartha Online Telugu News