Breaking News

జిల్లాలో రీసర్వే, హౌసింగ్ పనులు వేగవంతం !!

-జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్
-అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాల్లో జరుగుతున్న రీసర్వే పనులు, భూసేకరణ, హౌసింగ్ నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ సంబందిత అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం అమరావతి నుండి రీ సర్వే, భూసేకరణ, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ, ఈ- క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ సంబంధిత జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి విసి ద్వారా మాట్లాడుతూ.. జాతీయ రహదారులకు భూసేకరణ, గృహ నిర్మాణాలు, భూముల రీ సర్వే పనులను వేగవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. భూముల రీ సర్వే ప్రక్రియ తర్వాత భూ యజమానులకు జారీచేసే భూ హక్కు పత్రాల్లో ఎలాంటి తప్పుల్లేకుండా చూసేందుకు రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. తొలిదశలో సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో జారీచేస్తున్న పత్రాల్లో కొన్నిచోట్ల క్లరికల్‌ తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసేందుకు వెబ్‌ల్యాండ్‌లో కొత్తగా నాలుగు ఆప్షన్లు ఇచ్చామని తెలిపారు.
సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న భుహక్కు భూ రక్ష రీసర్వేలో భాగంగా గ్రౌండ్ వ్యాలిడేషన్, డిఎల్ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. స్పందన అర్జీలపై సకాలంలో స్పందించి అర్జీదారులకు అర్థవంతమైన పరిష్కారం చూపాలన్నారు. వ్యవసాయశాఖకు సంబంధించి రబీ వరి పంటకు ఈ క్రాపింగ్ కు సన్నద్ధం కావాలని అన్నారు. సూపర్ చెక్ ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చిందని తాహసిల్డార్లు, ఆర్డీవోలు, అగ్రికల్చర్ అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డ్వామా,హౌసింగ్ పీడీ జీ.వీ. సూర్య నారాయణ, రీ సర్వే ఏడి ఎస్. గోపాల్ రాజా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ రాజు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *