Breaking News

గోరుముద్ద, అంగన్వాడీ, రేషన్ పంపిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.

-రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ E. లక్ష్మి రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న గోరుముద్ద పథకం, రేషన్ బియ్యం పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ E. లక్ష్మి రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో రేషన్ షాపులను, ఏం డి యు వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల వస్తవుల పంపిణి, అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలో గోరుముద్ద పథకం అమలును రాష్ట్ర ఆహార కమిషన్ మెంబర్ . లక్ష్మి రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల 63 వేల పైగా తెల్ల రేషన్ కార్డులు 23,000 వేల మంది అంత్యోదయ రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రేషన్ దుకాణాలు మొబైల్ వాహనాల ద్వారా సకాలంలో ప్రతి రేషన్ కార్డు దారునకు నిత్యావసర వస్తువులను అందజేయాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణి స్త్రీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని నిర్దేశించిన సమయంలో సరైన పద్ధతిలో అందిచాలన్నారు. పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతులను చేయాలన్నారు. ఎనీమియా తో బాధపడే చిన్నారులు, మహిళల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రక్తహీనత లోపం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటినుండి 36 వారాల పాటు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్ర ద్వారా అందజేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అనుభవం కలిగిన అయాలు పప్పు, ఆకుకూరలు, గుడ్లు, వంటి పౌష్టికాహారాన్ని వండేలా చర్యలు తీసుకోవడం వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల ద్వారా అందించే అటుకులు రాగి పిండి జొన్న పిండి బెల్లం వేరు శనగ చిక్కి, ఎండు కార్జురం వంటివి గర్భిణీ స్త్రీలు తప్పక ఉపయోగించేలా చర్యలు తీసుకొని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు. మార్పు ట్రస్ట్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు అందిస్తున్న న్యూట్రిషన్ పొడి పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇదే విధానాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రలలో సరఫరా చేసేలా కృషి చేయాలన్నారు.
వాంబే కాలనీలోని డా. దక్షిణామూర్తి పాఠశాలలో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పధకాన్ని పరిశీలించి మధ్యాహన భోజనం తప్పని సరిగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మధ్యాహన భోజన తయారీలో నాణ్యత పరిశుభ్రతను తప్పగా పాటించేందుకు చర్యలు తీసుకోవాలని లక్ష్మిరెడ్డి పాఠశాల నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా అధికారిణి శ్రీమతి. కోమలిపద్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. ఉమాదేవి, సిడిపివో టి. నాగమణి, సూపర్ వైజర్ ప్రశాంతి, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీకాంత్, సహాయ సరఫరా అధికారులు కె.శ్రీలక్ష్మి, సిహెచ్ ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *