Breaking News

శాస్త్ర పరిజ్ఞానంలో నూతన ఆవిష్కరణలకు ఆలోచనలు చేయాలి.

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలికేలా విద్యార్థులలో ఆలొచన పెరగాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు అన్నారు. విజయవాడ లయోలా కళాశాలలో స్టెప్‌ సంస్థ ఆధర్వంలో మూడు రోజులపాటు నిర్వహించిన సైన్స్‌ ఫెయిర్‌ ముగింపు ఉత్సవాలకు, జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ్‌ జిల్లా కలెక్టర్‌ మట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయన్నారు. సమాజ అభివృద్ధి అనేది ఎదో ఒక ఆలోచన నుంచి ఉద్బవిస్తుందన్నారు. విద్యార్థులు సృజనాత్మకతమైన ఆలోచనల ద్వారా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు అత్యున్నతమైన ప్రతిభను కనపరచి పలు ఆవిష్కరణలను రూపొందించడం అభినందనీయమన్నారు. ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులు ప్రయోగల స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థులు శాస్త్రీయ దృక్పధాన్ని మరింత పెంచుకుని నూతన ఆవిష్కరణల ద్వారా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడంపై అధ్యాపకులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు కోరారు.
శాసన మండలి సభ్యులు కెఎస్‌. లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ సృజనాత్మకత నైపుణ్యం శాస్త్రీయ దృక్పదంతో శాస్త్ర సాంకేతిక వైద్య రంగాలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ శాస్త్రవేత్తలు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజులలో కొత్త కొత్త ఆలోచనలతో రీసెర్చ్‌ చేసిన ఫలితాల ద్వారా ప్రపంచంలోనే దేశ ప్రతిష్టతను అగ్రభాగాన నిలిపారన్నారు. వారి స్పూర్తితో ఇన్నోవేటెడ్‌ రీసెర్చ్‌ చేసేలా విద్యార్థులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పై ఆసక్తిని పెంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం వుందన్నారు.
సైన్స్‌ ఎగ్జిబిషన్‌ లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 200 పైగా ఆవిష్కరణలను ప్రదర్శించారు. వీటిలో ఉత్తమ ఆవిష్కరణలను రూపొందించిన విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో స్టెప్‌ సంస్థ అద్యక్షురాలు జి. జ్యోత్న్స, కార్యదర్శి జి. వాణి, లయోలా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ వై.టి.ప్రభు, ఎస్‌అర్‌అర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. కె. భాగ్యలక్ష్మి, నలంద కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం అనురాధ, పలు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *