Breaking News

ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. స్థానిక మొగల్రాజపురం మధు గార్డెన్స్ లో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా ఉత్సవ్ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మార్చినెలలో క్రమం తప్పక మహిళా ఉత్సవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. జన శిక్షణ సంస్థాన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన మహిళలకు పరిశ్రమల స్థాపనకు శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు l ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయన్నారు. కొత్తగా పరిశ్రమల రంగంలోకి వచ్చే యువ మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇటువంటి వేదికల ద్వారా అవకాశం కల్పించాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించారన్నారు. సమాజానికి వెన్నుముక మహిళలని కలెక్టర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు వీలుగా డ్వాక్రా బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. జన శిక్షణ సంస్థాన్ చైర్ పర్సన్ డా. విద్యా కన్నా మాట్లాడుతూ మహిళా ఉత్సవ్ నేటినుండి ఈనెల 12వ తేదీ వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మహిళలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్టాల్స్ ను సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఎ.పూర్ణ , మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి, నగరపాలక సంస్థ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శకుంతల, వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి రష్మీ, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *