తిరుపతినేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ ప్రిసైడింగ్ అధికారుల చెక్లిస్ట్ ఆధారంగా సూచించిన దాదాపు 30 రకాల వస్తువులను తప్పనిసరిగా డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషణ్ కేంద్రాల నుండి పంపిణీ జరిగేలా చూడాలని, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాల వారిగా సిద్ధం చేస్తున్న పోలింగ్ మెటీరియల్ , కలెక్టరేట్ కు చేరుకున్న బ్యాలెట్ పేపర్ల షీల్డ్ బాక్సులను జిల్లా కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ నుండి సిద్దం చేసి తరలిస్తున్న పోలింగ్ మెటీరియల్ జిల్లాలోని నాలుగు డివిజన్ కేంద్రాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలకు చెక్ లిస్ట్ మేరకు అందేలా చూడాలని అన్నారు. ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ టీచర్ ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలకు పింక్ కలర్, పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలకు తెలుపు రంగు బ్యాగులలో సిద్ధం చేసిన పోలింగ్ మెటీరియల్ జిల్లా కలెక్టర్ చెక్ లిస్ట్ ఆధారంగా ప్రతి వస్తువును చెక్ చేసి పలు సూచనలు చేసారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు , పోలింగ్ కేంద్రాల వారిగా మార్క్ డ్ ఓటర్ల జాబితా , మెటల్ , పేపర్, రబ్బర్ స్టాంపులు, 14,14 ఎ , 15, 16 ఫారమ్స్ , పి.ఓ.డైరీ , వంటివి సరిచుడాలని అన్నారు. వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు సి.ఇ.ఓ., ఆర్.ఓ., డి ఇ ఓ వీక్షించే విధంగా వుండాలని, అందుకు సంబందించిన టెక్నిషియన్లు అందుబాటులో వుండాలని , ఈ 12 , 13 పోలింగ్ కేంద్రాలలో రికార్డయిన వీడియో అందించాలని అన్నారు. అవసరం వున్న కేంద్రాల్లో వీడియో రికార్డు కూడా చేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ వారి పరిశీలనలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు, ఆర్డిఓ కనకనరసా రెడ్డి , స్పెషల్ డిప్యూటి కలెక్టర్ భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, అర్బన్ తహసిల్దార్ వెంకటరమణ, కలెక్టర్ కార్యాలయ సూపరిన్ టెన్ లు పరమేశ్వర స్వామి, భార్గవి, డి టి లు శ్యామ్ , మోహన్ రెడ్డి, రామచంద్ర, జానీ , విజయభాస్కర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News