Breaking News

మహిళలు అన్ని రంగాల్లో ముందజలో ఉంటున్నారు

-ప్రతీ కుటుంబం ఆర్థికంగా బలపరిచే విధానం లో మహిళల పాత్ర అభినందనీయం.
-నగరపాలక సంస్థ కు మహిళల శక్తి వల్ల మంచి పేరు ప్రతిష్ట లు వచ్చాయి.
-మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు అన్ని రంగాల్లో ముందజ లో ఉండి ప్రతీ కుటుంబం కుటుంబాన్ని ఆర్థికంగా బలపరిచే దిశలో చేపడుతున్న చర్యలు అభినందనీయమని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కు మార్ అన్నారు.nగురువారం స్థానిక శ్రీ ఆనం కళా కేంద్రంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, అదనపు కమషనర్ పి ఎం సత్యనారాయణరావు వేణి, పి. డి. మెప్మా, బి. ప్రియం వధ, మహిళా అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ మహిళా పారిశుధ్య సిబ్బంది మెరుగ్గా పని చేయడం వల్ల శానీటేషన్ నిర్వహణ లో కార్పొరేషన్ లో మెరుగ్గా ఉంద ని కితాబు ఇచ్చారు. రాజమహేంద్రవరం లో గతం లో ముఖ్య మంత్రి వారి పర్యటన ను విజయవంతం చేయడం మహిళల వల్లే సాధ్య పడిందన్నారు. మహిళలు తలచుకుంటే ఏమైనా చేయగల సత్తా ఉంటుందని అన్నారు. మహిళలు ఉత్సాహంగా ఇటు కుటుంబ వ్యవహారాలతో పాటుగా క్రీడలు, ఉద్యో గాల్లో అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ లో వాలంటీర్ లు ఉంటే వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారన్నారు.

రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ రోజున మహిళా దినోత్సవం యాదృచ్ఛికం అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి గా మహిళలకు సముచిత స్థానం కల్పించి మహిళల పేరునే ప్రభుత్వ పధకాలు అమలు చేయడం జరుగుతోందని అన్నారు. మహిళల పట్ల జగనన్న కి ఎంతో ఆప్యాయత ఉందని, వారి కోసం. అన్ని సంక్షేమ పథకాల లో వారికే ప్రాధన్యత ఇస్తూ, స్థానిక సంస్థల రాజకీయ పదవుల్లో 50 శాతం పై గా సీట్లు ఇవ్వటం జరిగింది అన్నారు. కుటుంబ నిర్వహణలో గృహిణి గా మహిళ ఆర్థిక నిర్వహణ లో చక్కటి పాత్ర పోషిస్తోందని అన్నారు. మహిళలలు ఎవరికి తక్కువ కాదు అనే ఆలోచన మనలో ఉండాలన్నవారు. ఆసరా, చేయూత, చేదోడు, అమ్మ ఒడి, ఇంటి స్థలాలు అన్ని పథకాలు మహిళల పేరునే ప్రభుత్వం అందిస్తూ మహిళలు ఎదుగుదలకు ఆర్థిక భరోసాను కల్పించడం జరుగు తొందన్నారు.

మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ లు కే. భవాని, సభ్యులు ఏ. సావిత్రి, ఎస్. సరస్వతి, కే. వరలక్ష్మి, కార్పొరేషన్ మహిళ ఉద్యోగులను సన్మానాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సందేశాత్మక నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మెప్మా పి. డి. పి. డి. ప్రియం వధ, ఏడిషిన ల్ కమీషనర్, పి. ఎం.సత్యవేణి, ఎం. హేచ్. ఓ, వినూత్న, రూడా సెక్రటరీ, పి. శైలజ వల్లీ, డిప్యూటీ కమీషనర్, ఎస్. సాంబ శివరావు, పట్టణ మహిళా సమాక్య ప్రెసిడెంట్ లు కే. భవాని, ఏ. సావిత్రి, ఎస్. సరస్వతి, కే. వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *