Breaking News

క్షేత్రస్థాయిలో బడి మానిన పిల్లల వివరాలను సేకరించి నివేదికను సమర్పించండి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షేత్రస్థాయిలో బడి మానిన బడిఈడు పిల్లల వివరాలను సేకరించి వారం రోజులలోపు నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బడి మానిన పిల్లల వివరాల సేకరణకు చేపట్టవలసిన చర్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో జిల్లా వ్యాప్తంగా 5,600 మంది బడిమానిన బడిఈడు పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు. వీరిలో 3,700 మంది ఇతర ప్రదేశాలకు వెళ్ళడం జరిగిందని, మిగిలిన వారిలో సుమారు 1200 మందికి పైగా తిరిగి బడిలో చేర్పించగా, సుమారు 500 మంది మాత్రమే బడిఈడు పిల్లలు బయట ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. మరోక సారి బడిమానిన పిల్లల పూర్తి సమాచారన్ని సేకరించి బడిలోకి చేర్పించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తి పర్యవేక్షణ పెట్టి నిర్థిష్టమైన నివేధికలను రూపొందించాలన్నారు. ఐదవ తరగతి చదివి ఆరవ తరగతి చేరే సమయంలో ఎంత మంది డ్రాప్‌ అవుట్‌ అయ్యారో అలాగే ఏడవ తరగతి నుంచి ఎనిమిది తరగతి, ఎనిమిది నుండి తొమ్మిదివ తరగతి తొమ్మిది నుండి పదవ తరగతికి అప్‌గ్రేడ్‌ అయిన సమయంలో ఎంత మంది విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ అయినది పూర్తి వివరాలను సేకరించాలన్నారు.అప్‌గ్రేడ్‌ సమయంలో డ్రాప్‌ అవుట్‌ అయిన వారితో పాటు అనంతరం మరికొంతమంది విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం వంటి కారణాల వలన బడి మానివేసిన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ వాలంటీర్లతో కలిసి వారి పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి బడిమానిన బడిఈడు పిల్లలను గుర్తించి తగిన కారణాలను నమోదు చేసి నివేధికలను వారం రోజులలోపు సమర్పించాలన్నారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి మండలాభివృద్ధి అధికారులు, వార్డు సచివాలయాలకు సంబంధించి మున్సిపల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో బడి మానిన పిల్లల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని పర్యవేక్షించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
కాన్ఫరెన్స్‌లో డిఇవో సివి రేణుక, ఏపిసి జి. మహేశ్వరరావు, డిప్యూటి డిఇవో కె. రవికుమార్‌, జిల్లాకు చెందిన యంపిడివో, యంఇవోలు, ఏపియంలు సెక్టోరల్‌ అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *