అమరావతిః, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపి లో ఉద్యోగ,ఉపాద్యాయ,కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగులలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యదోరణికి నిరసన గా ఉద్యోగులనుండి వస్తున్నవత్తిడి మేరకు దశలవారి ఆందోళణా కార్యక్రమాలను కొనసాగించాలని నిన్నటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సంవత్సరాలుగా ప్రభుత్వం స్పందించకుండా, రెండు సంవత్సరాలుగా వాడుకున్న ఉద్యోగుల డబ్బులు చెల్లించకపోవడం, ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన అన్నీ రకాల అరియర్సు, లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు, మెడికిల్ రీయింబర్స్ మెంటు బిల్లులు, డిఏ బకాయిలు, కొత్తగా ఇవ్వాల్సిన డిఏలు తధితర ఆర్దికపరమైన అంశాలుతో పాటు ప్రభుత్వమే హామీ ఇచ్చిన సిపియస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపుదల తదితర ఆర్ధికేతర అంశాలు పరిష్కరించేలా చూడనందున ఈ ఉద్యమ కార్యచరణను కొనసాగిస్తున్నామన్నామని, ఈ నెలాఖరు వరకు ఏపిజెఏసి అమరావతి ఆద్వర్యంలో చేపట్టదలచిన marchi- 9వ తేదీ నుండి ఏప్రిల్-5వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసనలు, తేదిః17 & 20 తేదిలలో (రెండు రోజులు) ఉద్యమానికి మద్దతుకోరుతో అన్నీ ప్రభుత్వ కార్యాలయాల సందర్శన కార్యక్రమాలు గూర్చి, ఈనెల 21 నుండి రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉద్యోగులు వర్కుటూరూల్, 27వ తేదీన కారుణ్య నియామకాలు పొందని కుటుంబాల ఇండ్ల సందర్శన తదితర ఆందోళణా కార్యక్రమాలు గూర్చి ఈనెల 9న జరిగిన రాష్ట్రకార్యవర్గంలో తీసుకున్న ఆందోళణాకార్యక్రమాలషెడ్యూల్ నోటీసును ప్రభుత్వప్రధానకార్యదర్శి గారికి విజయవాడలో వారి క్యాంపు కార్యాలయంలో నేడు శుక్రవారం ఉదయం అందజేసామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు,కోశాధికారి వి.వి.మురళీకృష్ట నాయుడు, బి.కిషోర్ కుమార్, వి.అర్లయ్యా, ఏ.సాంబశివ రావు, యస్.మల్లీశ్వర రావు, బి.జగదీష్ తదితరులు శుక్రవారం ఒక ప్రకటద్వారా తెలియజేసారు.
Prajavartha Online Telugu News