-నేటి సాయంత్రం 4 గం. నుండి పోలింగ్ దినం మార్చి 13 సాయంత్రం 4 గం. వరకు మద్యం దుకాణాలు మూసివేయాలి:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం – నెల్లూరు- చిత్తూరుపట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజక వర్గ ఎంఎల్.సి ఎన్నికలను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో పోలింగ్ రోజు అనగా ఈ నెల 13న (సోమవారం) పోలింగ్ జరగనున్న 138 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని కార్యాలయాలు, విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు మరియు నేటి సాయంత్రం 4 గం. నుండి పోలింగ్ దినం మార్చి 13 సాయంత్రం 4 గం. వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే. వెంకట రమణ రెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.
Prajavartha Online Telugu News