అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న టీడీపీ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తమ రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 18వ డివిజన్ 82వ సచివాలయం పరిధిలో రాణిగారితోట తమ్మిన పోతురాజు స్ట్రీట్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అవ్వగానే సచివాలయ,వలంటీర్ వ్యవస్థ లు ప్రవేశపెట్టి ప్రజల ముంగిటకు పాలనను చేరువ చేశారని, గతంలో మాదిరి లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలలో రోజురోజుకు జగన్ కి పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ కి దిమ్మతిరిగి ఇక తమ పార్టీకి ఉనికి ఉండదని భయపడి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారని విమర్శించారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిన మంచి కనపడుతుంది అని మీ డ్రామాలు ఇక నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ డివిజన్ ప్రజలకు మంచి జరిగేలా రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు ఇళ్ళు కోల్పోయిన వారికి, ఇళ్ళు లేని పేదవారికి ఉచితంగా ఇల్లు ఇచ్చిన ఘనత వైసీపీ దే అని అన్నారు. నగర అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టీ వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అని, రాష్ట్రానికి తలమానికంగా అంబేద్కర్ స్మృతీ వనం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 18వ డివిజన్ కార్పొరేటర్,వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డివిజన్ అధ్యక్షులు భిక్షాల్ రెడ్డి మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

108 కార్యాలయం ప్రారంభం
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణిగారితోట సిమెంట్ గౌడౌన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న 108 కార్యాలయాన్ని నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ శనివారం ప్రారంబించి అందులో అందుబాటులో ఉన్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేద ప్రజలకు తక్షణ వైద్యసహాయం కొరకు నాడు దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ఈ 108 సేవలను ప్రారంభిస్తే మధ్యలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసారని విమర్శించారు. కానీ నేడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ 108 సేవలను మరింత విస్తృత పరచి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారని పేర్కొన్నారు. 108 సేవలతో పాటు ఆరోగ్య శ్రీ గాని, ఇప్పుడు కొత్తగా విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేయడం గాని ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అవినాష్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *