Breaking News

ఆంధ్రప్రదేశ్ బిఆర్ ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీగా చేరికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ ఎస్ ప్రభంజనం మొదలైంది జాతియ స్థాయిలో బిఆర్ ఎస్ మరింత బలోపేతం అయ్యేందుకు ఈ చేరికలు సూచికలుగా మారుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిఆర్ ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖ‌ర్ మాట్లాడుతూ బిఎస్ఆర్ జాతీయ అధ్యక్షులు కెసిఆర్ అభివృద్ధి దేశ వ్యాప్తంగా రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. తెలంగాణ దళితబంధు పథకం, తెలంగాణా రైతు భీమా పథకం, రైతు బంధు పథకాలతో యావత్తు దేశం కేసిఆర్ కు బ్రహ్మ రథ పడుతుందన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ పార్టియో అన్నారు. రాహుల్ గాంధీని నమ్మ పరిస్థితి లేదని అన్నారు. కేసిఆర్ దేశవ్యాప్తంగా ఉన్న మిగతా పార్టీలను కలుపుకోని పని చేస్తారని అన్నారు. తెలంగాణ తరహ అభివృద్ధి చుసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిఆర్ ఎస్ కు బ్రహ్మరధ పడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం పాలనలో విఫలం అయ్యాందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్పీ, ఎస్టీ, బిసి, పలు సామాజిక వర్గాలుకు చెందిన వారు పెద్ద ఏత్తున బిఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.ఆనంతరం విజయవాడ తూర్ఫులో బిఆర్ ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాది, రాజనాల మెహర్, జి.సుబ్రహ్మణ్యం, ఎం.పవీణ్ కుమార్, కె.సురేష్, యు.శ్రీనివాసరావు, రత్న యాదవ్, మీనా, జ్యోతి, నాగలక్ష్మి, అడ్వకేట్ పసుపులేటి సుబ్బారావు(బిజెపి జనరల్ సెక్రటరీ నర్సరావు పేట), వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కావిడి క్రిష్ణ, రాజేష్ విజయవాడ, బాబ్జి విజయవాడ సెంట్రల్, రౌతు నెహ్రు,సుంకర విశ్వేశ్వరావు, మస్తాన్ వళి, చిలకరాజేష్ , శేషురెడ్డి, పాపరావు వందిలాదిగా బిఆర్ఎస్ లో చేరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *