Breaking News

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కార్పొరేటర్ బాలి గోవింద్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ ఆదేశాల మేరకు శనివారం  8వ రోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్ కార్పొరేటర్  బాలి గోవింద్  డివిజన్లోని గాంధీనగర్ రాజ్ యువరాజ్ సెంటర్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలు ఏమున్నాయని అడిగి తెలుసుకుని, గాంధీనగర్ సచివాలయం సిబ్బందితో, విఎంసి శ్రీధర్  సిబ్బందితో మాట్లాడి తన దృష్టికి వచ్చిన సమస్యను సాయంత్రంలోగా పరిష్కరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా బాలి గోవింద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకారంతో డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ ప్రెసిడెంట్ పూలపా కృష్ణ,  27వ డివిజన్ ప్రెసిడెంట్ కురిటి శివ, 36వ డివిజన్ గృహ సారథులు, కన్వీనర్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *