Breaking News

పోలవరం ప్రాజెక్టుపై సిఎస్ సమీక్ష.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టుపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ ఎంత మేర దెబ్బతిన్నది దానిని ఎప్పటి లోగా పునర్నిర్మాణం చేయగలరు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ఇప్పటి వరకు అమలు చేసిన ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ ఇంకా అమలు చేయాల్సిన ప్యాకేజీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇంకా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను మూడు మాసాల్లో పునర్నిర్మాణం చేయాలని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ కమీషనర్ శ్రీధర్, పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, ఎస్ ఇ నర్సింహమూర్తి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *