-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాటర్ స్పోట్స్ నందు పలు విభాగాలలో క్రీడా కారులకు శిక్షణ అందించి అంతార్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వాటర్ స్పోట్స్ ఆకాడమిని ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్త్నుట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. జాతీయ స్థాయిలో వాటర్ స్పోట్స్ సంబంధించిన వివిధ క్రీడాంశాలలో క్రీడాకారులు ప్రతిభ కనపరుస్తున్న నేపథ్యంలో వాటర్ స్పోట్స్‌కు సంబంధించి క్రీడా కారులకు వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు అనువుగా అకాడమి ఏర్పాటుకు అవసరమైన పర్యటక శాఖ స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, డిస్టిక్ట్ స్పోట్స్ ఆథారటీ, రెవెన్యూ అధికారులతో బెరం పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మట్లాడుతూ జాతీయ అంతార్జాతీయ స్థాయిలో వాటర్ స్పోట్స్ విభాగంలో రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు వాటర్ స్పోట్స్ అకాడమి స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా వాటర్ స్పోర్స్ విభాగంలో రోయింగ్, కెనాయినింగ్, కయాకింగ్ అంశాలపై శిక్షణ అందించి అత్యుత్తమ క్రీడా కారులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. ఇప్పటికే వాటర్ స్పోట్స్ నందు పలు విభాగాలలో క్రీడాకారులకు తాత్కాలింగా శిక్షణ అందిస్తున్నారని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. పరిశీలనలో డిఎస్‌ఏ సిఇవో శ్రీనివాసరావు, ఛీఫ్ కోచ్ అజీజ్, తహాశీల్థార్ మాధురి, టూరిజం శాఖ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News