Breaking News

సమస్యను అర్థం చేసుకోండి. ఆలోచించండి.. పరిష్కరించండి…

-స్పందన అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సూచన
-నేటి స్పందనలో108 అర్జీలు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీ సమస్యను అర్థం చేసుకుని, ఆలోచించడం ద్వారా పరిష్కార మార్గాలను కనుగొన్ని సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అధికారులకు సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీని ముందు క్షుణ్ణంగా చదివి సమస్యను అర్థం చేసుకుని ఆలోచించే పరిష్కార మార్గం కనుగొంటే అర్జీదారుడు సంతృప్తి చేందేలా సమస్యను పరిష్కరించవచ్చునని ఇటువంటి దోరణిని అధికారులు అవలంభించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు. సమస్యను పరిష్కరించాలనే ఆసక్తి ఉన్నప్పుడే సమస్య పరిష్కారానికి మార్గం సుగుమం అవుతుందన్నారు. అర్జీని చూసి సంబంధిత అధికారికి పంపడం ఒక్కటే మార్గం కాదన్నారు. పరిష్కార మార్గాన్ని ఆలోచించి ఆ విధమైన సూచనలు కింది స్థాయి అధికారులకు సూచించిన్నప్పుడే పరిష్కారం అవుతుందని అప్పుడే అర్జీదారుడు స్పందనపై పెట్టుకున్న నమ్మకానికి బలం చేకూర్చిన వారమవుతామన్నారు. ప్రతి సమస్యకి ఎక్కడో ఒక చోట తప్పక పరిష్కారం లభిస్తుందన్నారు.అది ఎక్కడ అన్నది జిల్లా స్థాయి అధికారులు ఆసక్తితో తెలుసుకుని పరిష్కరిస్తే అర్జీదారుని కళ్ళలో అనందం చూసి తృప్తి చెందవచ్చునని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. స్పందనతో పాటు ఆఫ్‌ లైన్‌, ఆన్‌ లైన్‌లో నమోదవుతున్న అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్‌ సెంటర్‌, స్పందన మొబైల్‌ యాప్‌, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా కూడా అర్జీలు నమోదవుతుంటాయన్నారు. ఒకసారి నమోదైన అర్జీ తిరిగి నమోదు కాకూడదన్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సత్వర న్యాయం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
నేటి స్పందనలో 108 వినతులు నమోదు కాగా వీటిలో అధికంగా రెవెన్యూ శాఖలో 42, పోలీస్‌ 20, యంఎయుడి 9, పంచాయతీరాజ్‌ 5, గ్రామ వార్డు సచివాయలం 4, వైద్య 3, ఉపాధి కల్పన 3, వ్యవసాయ 2, సర్వే అండ్‌ సెటిలిమెంట్‌2, రిజిస్ట్రర్‌ అండ్‌ స్టాప్‌ 2, విద్యా శాఖ 2, హౌసింగ్‌ 2, డిఆర్‌ డిఏ 2, పౌర సరఫరాల శాఖ 2, కాగా మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి 8 అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్‌ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్‌ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందన కార్యక్రమంలో డిఎస్‌వో పి కోమలి పద్మ, ఐసిడిఎస్‌ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్‌, డిసివో సిహెచ్‌ శైలజ, డిఆర్‌డిఏ పీిడి కె. శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్‌, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం. విజయభారతి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *