Breaking News

ఆశావహ జిల్లాల కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం అంతటా 100 కంటే ఎక్కువ జిల్లాలను అభివృద్ధిపరచడానికి ఆశావహ జిల్లాల కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గా ఎంపికైన ఆశావహ జిల్లాల నుంచి 68 మంది షెడ్యూల్ కులాల, తెగలకు చెందిన ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం మార్చి 16-17 నుంచి ‘ఎడ్యుకేషనల్ కమ్ ఫైనాన్షియల్ లిటరసీ’ టూర్‌లో రాజధాని నగరం న్యూ ఢిల్లీని సందర్శిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది.

39 మంది బాలురు, 29 మంది బాలికలతో కూడిన బృందంలో విద్యార్థులతోపాటు, వారి ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఆకాంక్షాత్మక జిల్లాలు గా ఎంపికైన విజయనగరం, విశాఖపట్నం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందినవారితోపాటు తమిళనాడులోని విరుదుంగర్  రామనాథపురం అనే రెండు ఆకాంక్షాత్మక జిల్లాల వారూ పాల్గొంటున్నారు. వారంతా ప్రస్తుతం దేశ రాజధాని పర్యటనలో ఉన్నారు. పర్యటన సందర్భంగా, విద్యార్థులు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సంభాషించారు పార్లమెంటుభవనాన్ని, ప్రధాన మంత్రి సంగ్రహాలయాన్ని  ఇండియా గేట్‌లను సందర్శించారు. విద్యార్థులు నోయిడాలోని భారత ప్రభుత్వ నాణాల ముద్రణా టంకశాల ను కూడా సందర్శిస్తారు. శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనా కార్యక్రమానికి హాజరవుతారు.

పార్లమెంట్ సందర్శన, ప్రధానమంత్రి సంగ్రహాలయ సందర్శన చరిత్ర  రాజనీతి సంగ్రహావలోకనం కలిగించే అంశాలు, అయితే ఆర్థిక అక్షరాస్యతపై కార్యక్రమం, భారత ప్రభుత్వ   నాణాల ముద్రణాశాల- మింట్‌ను సందర్శించడం ద్వారా వివిధ ఆర్థిక  అంశాల గురించి అవగాహన లభిస్తుంది. జనవరి 2018లో భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆశావహ జిల్లాల కార్యక్రమం (ADP) దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ జిల్లాలను అభివృద్ది దిశగా సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ప్రారంభించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *