తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
సినీ జ కీయరంగాలలో NTRది చెరగని ముద్ర అని NTRతనయీడు హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ అన్నారు. బుథవారం స్థానిక పెమ్మసాని థియేటర్లో NTR శతజయంతి ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ తనకు జన్మనిచ్చి, అభిమానుల మనసులో చోటు కల్పించిన తన తండ్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన ఈ సందర్భంగా ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఎవరి రుణాన్ని ఉంచుకోలేదని తనను ఆదరించిన ప్రజల కోసం తన వంతుగా ఎంతో చేశారని గుర్తు చేశారు.
కుల మతాల ప్రాంతాలకు కు తాను అతీతుఢు
చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీరు అందించారని పేర్కొన్న ఆయన ఎన్టీఆర్ తో పాటు నటించిన వారందరూ చిరస్మరణీయులే అని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల రోజే పాతాళ భైరవి సినిమా విడుదలైన రోజు కావడం మరో విశేషం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో కలిసి నటించిన వారంతా గొప్పవారేనని పేర్కొన్న బాలకృష్ణ, కమర్షియల్ సినిమాలకు ఎన్టీఆర్ ఆద్యులు అంటూ తెలిపారు. తన తండ్రి కులమతాలకు అతీతంగా పని చేశారని, తాను కూడా కులమతాలకు అతీతం అంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. తన అభిమానులు అందరూ తన కుటుంబంలో భాగమేనని బాలకృష్ణ వెల్లడించారు.
సావిత్రి కూతురు, బీ నాగిరెడ్డి కుమారునికి ఎన్టీఆర్ అవార్డుల అందజేత
ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరికి, నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి ఎన్టీఆర్ పేరిట అవార్డులను బాలకృష్ణ అందించారు. ఈ సందర్భంగా బి నాగిరెడ్డి, సావిత్రి గార్లను కూడా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. సావిత్రి గారు మహానటి అని నటన అంటే సావిత్రిలా ఉండాలని ఆమె నటన నేటికీ అజరామరంగా సజీవంగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిందన్నారు.
Prajavartha Online Telugu News