Breaking News

బాలల హక్కుల పరిరక్షణ మన అందరి బాధ్యత, బాల్య వివాహాల నిరోధానికి పటిష్ఠ చర్యలు:కలెక్టర్

-మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానవ అక్రమ రవాణ నిరోధానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు : ఆం.ప్ర.బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు లక్ష్మి దేవి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు (ఎస్ సి పి సి ఆర్) ఎం. లక్ష్మీదేవి నేటి శుక్రవారం ఉదయం ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జయలక్ష్మి తో పాటు తిరుపతి జిల్లా కలెక్టరు కే వెంకట రమణ రెడ్డి ని స్థానిక కలెక్టరేట్ లో కలిసి బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానవ అక్రమ రవాణా నివారణకు చర్యలు క్షేత్ర స్థాయి నుండి పర్యవేక్షించెలా ప్రణాళికలు చేపడదామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరు గారు మాట్లాడుతూ అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి వరకు అవగాహన కల్పిస్తామని, బాలల హక్కుల పరిరక్షణకు అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని అన్నారు.. బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.

తదుపరి ఎస్ సి పి సి ఆర్ సభ్యులు లక్ష్మీదేవి వారు పథక సంచాలకులు మహిళా శిశు సంక్షేమ శాఖ వారితో కలిసి సిడిపిఓ లు మరియు సూపర్వైజర్స్ తో కలెక్టరేట్ సమావేశ మందిరము నందు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సి పి సి ఆర్ సభ్యురాలు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి అంగన్వాడీ కార్యకర్త, సూపర్ వైజర్లు, సి డి పి ఓ లు అందరు కలసికట్టుగ పనిచేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం పై అవగాహన కల్పిస్తూ 18 సం|| లోపు అమ్మాయిలకు పెళ్ళి చేస్తే జరిగే శారీరక మరియు మానసిక ఇబ్బందులను వివరించారు. గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలని తెలిపారు. పీఎం కేర్ ఆర్ఫన్ మరియు సెమీ ఆర్ఫన్ పిల్లలకు లభించే ప్రభుత్వ పథకాలు, ఉపకార వేతనాలు గురించి వివరించారు.

ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ సెమీ ఆర్ఫన్స్ ( కోవిడ్ 19) ఎవరైనా ఉంటే దరఖాస్తులను జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ (డిసిపియు) వారికి పంపాలని అన్నారు. వారికి స్పాన్సర్షిప్ కింద నెలకు రూ.4000 లు వస్తుందని తెలిపారు. అలాగే సంస్థాగత సేవల గురించి వివరించారు.

ప్రొటెక్షన్ ఆఫీసర్ డి.ప్రతిమ మాట్లాడుతూ మిషన్ వాత్సల్య ఫాస్టర్ కేర్ స్పాన్సర్షిప్ గురించి వివరించారు.

మధ్యాహ్నం ఎస్ ఓ ఎస్ స్వచ్చంద సంస్థ ఏర్పేడు మరియు బాలసదనం శ్రీకాళహస్తి లను ఎస్ సిపిసిఆర్ మెంబర్ సందర్శించి ఎస్ ఓ ఎస్ వారు చేస్తున్న సేవలను గురించి, వారు అమలు చేస్తున్న ఫ్యామిలీ కేర్ ప్రోగ్రాం గురించి తెలుసుకున్నారు.

శ్రీకాళహస్తి బాలసదనం నందు పిల్లల నమోదు తక్కువ ఉన్నదని, పిల్లల నమోదు సంఖ్య పెరగాలని తెలిపారు. మౌలిక సదుపాయాలు బాగున్నాయని అన్నారు. బాలసదనంలో సిబ్బంది కొరత చాలా ఉందని ఎస్ సిపిసి ఆర్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడతామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *