Breaking News

పన్ను వసూళ్లు నూరు శాతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పై వడ్డీ రద్దు చేసిందని, మార్చి నెలాఖరు తర్వాత వడ్డీ కలుస్తుంది కనుక, పన్ను ఈ నెలలోనే పూర్తిగా చెల్లించాలని పన్ను బకాయిదార్లకు విస్తృతంగా తెలియచేసి, పన్ను వసూళ్లు నూరు శాతం చేయాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ కేర్తి చేకూరితో కలిసి పన్ను వసూళ్లు, వడ్డీ రాయితీ తదితర అంశాల పై డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, ఖాళీ స్థల పన్నుల పై వడ్డీ రాయితీ ఇచ్చిందని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పన్ను రాయితీ అంశం సచివాలయాల వారిగా అడ్మిన్ కార్యదర్శులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి తెలియ చేయాలన్నారు. ఈ నెల 31 లోపు పన్ను చెల్లించిన వారికి వడ్డీ రాయితీ అమలు జరుగుతుందని, మార్చి 31 తర్వాత పన్నుకు వడ్డీ జమ అవుతుందన్నారు. ఆర్.ఐ.లు అడ్మిన్ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని, పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ పన్ను పై వడ్డీ రాయితీ ద్వారా దీర్ఘకాలంగా పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారికి సువర్ణ అవకాశం వంటిదన్నారు. నగరంలో భవన నిర్మాణదారులు కూడా నిర్మాణానికి ముందే ఖాళీ స్థల పన్ను చెల్లించాలని, అప్పుడే మార్ట్ గేజ్, ఎన్.ఓ.సి.ల మంజూరు వేగంగా అవుతాయన్నారు. లైసెన్స్ టెక్నికల్ ఇంజినీర్ల ఖాళీ స్థల పన్ను చెల్లింపు పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. నగర ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రాయితీని వినియోగించుకొని పన్నులు సకాలంలో చెల్లించాలని, పన్ను చెల్లింపుదార్లకు అనుగుణంగా అదనపు క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసి, నెలాఖరు వరకు కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ పెద్ది రోజ, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్ మూర్తి, రెవెన్యూ అధికారులు ప్రసాద్, బాలాజీ బాష, రవి కుమార్, పోలేశ్వరరావు, ఆర్.ఐ.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *