విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఎన్టీఆర్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చిమట బుజ్జి ఆధ్వర్యంలో మరియు బెంజ్ సర్కిల్ వద్ద తూర్పు నియోజకవర్గ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించి,కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్లకు, వాహన డ్రైవర్లకు మేలు చేస్తూ ప్రతి సంవత్సరం వాహన మిత్ర పథకం అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని కొనియాడారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు అమ్మఒడి, ఆసరా, సొంతింటి కల సాకారం చేసి అండగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జగనన్నను అండగా నిలవాలని అవినాష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ చిమటా సాంబశివరావు,తూర్పు నియోజకవర్గ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శెటికం దుర్గాప్రసాద్,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,తూర్పుకాపు డైరక్టర్ తేజ,కార్పొరేటర్ అంబెడ్కర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News