Breaking News

పెడనలో తాగునీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యం !!

-మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
పెడన పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది తన ప్రధాన లక్ష్యమని, ఆసియా మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ నిధులతో ఏడాది లోపు సమగ్ర తాగునీటి సరఫరా పథకం పూర్తి చేసి ప్రజలందరికీ శుద్ధమైన జలం అందుబాటులోకి తీసుకువ‌స్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం ఆయన పెడన పట్టణం 14 వ వార్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ( బంగ్లా స్కూల్ ) సమీపంలో 58 కోట్ల 23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సమగ్ర తాగునీటి సరఫరా పథకం మొదటి దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, భూగర్భ జలం వినియోగం లేకుండా కృష్ణా నది ద్వారా నేరుగా సరఫరా కాబడిన నీటిని శుద్ధిచేసి, పెడన టౌన్ లో ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడం త్వరితిగతిన జరుగుతుందన్నారు. ఈ స్కీం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉందని, దాదాపు 8700 ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడమే కాకుండా తలసరి 135 లీటర్ల నీటిని పెడన పట్టణంలో ప్రతిరోజు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కొత్తగా 275 కేఎల్ సామర్థ్యం గల సంపును తలకటూరు ఎస్ఎస్ ట్యాంకు వద్ద నిర్మించవలసిందని, 400 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల డీఐకే 9 పైపులు 15 కిలోమీటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెడన మున్సిపల్ చైర్ పర్సన్ బళ్ళా నాగ జోత్స్న రాణి, పెడన టౌన్ వైయస్సార్సీపి పార్టీ కన్వీనర్ బండారు మల్లికార్జునరావు, వైస్ చైర్మన్ మహమ్మద్ ఖాజా, 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికిపాటి రామానాయుడు, పెడన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, పెడన సచివాలయాల కన్వీనర్ మతిన్ ఖాన్, స్థానిక విద్యా కమిటీ చైర్మన్ మహమ్మద్ బాబు,14 వ వార్డ్ ఇంచార్జ్ బళ్ళా సాంబశివరావు, షాది ఖానా ప్రెసిడెంట్ అబ్దుల్ వజీమ్, కో ఆప్షన్ మెంబర్ వీరంకి నరసింహారావు, పెడన తహసీల్దార్ మధుసూధనరావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, వాలంటీర్లు- సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *