Breaking News

మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపండి..

-మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేయండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మాదక ద్రవ్యాల వినియోగించే వారిపై ఉక్కుపాదం మోపాలని మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా చేసే ఆసాంఫీుక శక్తులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులనుఆదేశించారు. నిషా ముక్తి భారత్‌ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల నివారణ పై బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులకు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక సమస్యలు, ఒత్తిడికి లోనై చెడు మార్గంలో పడుతున్నారన్నారు. శారీరక ఇబ్బందులు, జ్ఞాపకశక్తి మందగించడం, శ్వాసకోశ వ్యాధులకు గురై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం విక్రయం రవాణాను పూర్తిగా అరికట్టాల్సిన భాధ్యత జిల్లా అధికారుల ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో గంజాయి వినియోగానికి హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన క్రీస్తురాజుపురం, గంగిరెద్దులదిబ్బ, కెఎల్‌రావు నగర్‌, రైల్వే యార్డ్‌, వాంబేకాలనీ, కృష్ణలంక దోభిఘాట్‌, భవానిఘాట్‌, కనకదుర్గవారది, ఇబ్రహీంపట్నం, సీతానగరం తదితర ప్రాంతాలలో మాదక ద్రవ్యాల వినియోగించే ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగించే వారిపై ఈ ఏడాది 66 కేసులు నమోదు కాగా గత నెలలో 38 కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి రవాణాలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని ఇతర ప్రాంతాల నుండి గంజాయిని ద్విచక్ర వాహనాలు, మహిళలు, అనాధులను ఉపయోగించి రవాణా చేస్తున్నారని దీనిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. గంజాయి వినియోగించాలంటే భయం కల్పించే పరిస్థితులు తీసుకువస్తే కొంత మేరకు ఫలితాలను సాధించగలుగుతామన్నారు. వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు జిల్లాలో క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది వారి పరిధిలోని పంటలను పరిశీలించి అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించాలన్నారు. ఆకర్ష ఫౌండేషన్‌ ప్రతినిధులు గంజాయి వినియోగంచే వారిని గుర్తించి సమాచారాన్ని ఎప్పటకప్పడు పోలీస్‌ యంత్రాంగానికి అందించాలన్నారు. మాదక ద్రవ్వాలు మత్తుపదార్థాలకు అలవాటు పడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు మానసిక పరివర్తనలో మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాల నివారణ సామాజిక భాధ్యతగా గుర్తించి నివారణ చర్యలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. పార్సిల్‌ కొరియర్‌ సర్వీసుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాదక ద్రవ్యాల రవాణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తరచు కళాశాలకు గైరుహాజరయ్యే వారిని, తరచు అనారోగ్యానికి గురై ముఖకవలికలలో మార్పులు గమనిస్తే అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి మాదక ద్రవ్వాలను తీసుకుంటున్నట్లు గుర్తిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా యువతలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
సమావేశంలో ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటి చైర్మన్‌ జస్టిస్‌ కె.వి రామకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌,విభిన్నప్రతిభావంతుల జిల్లా సంక్షేమ అధికారి రామ్‌కుమార్‌, డిఇవో సివి రేణుక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎస్‌ నాగమణి, యువజన సంక్షేమ అధికారి యు శ్రీనివాసరావు, తిరువూరు ఆర్‌డివో వైవి ప్రసన్నలక్ష్మి, ప్రభుత్వ జనల్‌ ఆసుపత్రి డి ఎడికేషన్‌ అధికారి డా. స్వరాజలక్ష్మి, జిల్లా అటవీ శాఖ అధికారి అప్పన్న, ఎసిపి వెంకటేశ్వరరావు, అడిషనల్‌ డిసిపి రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *