Breaking News

క్షయ రోగులకు పౌష్టికాహారం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి జిల్లా క్షయ వ్యాధి నివారణా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆటోనగర్ హెల్త్ కేర్ నెంటర్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ ఆర్.స్వర్ణలత మాట్లాడుతూ కలెక్టర్ యస్.దిల్లీరావు ఆదేశాల మేరకు వాసవ్య మహిళా మండలి అయిదు మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరు నెలల పాటు పౌష్టికాహార కిట్లను అందివ్వడానికి ముందుకు వచ్చిందని ఆమె అన్నారు. ఇక నుండి ప్రతీ నెల మొదటి వారంలో కిట్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. క్షయ వ్యాధి పై అవగాహన కల్పించే నిమిత్తం ఆటోనగర్ నందు నెలరోజులపాటు వాసవ్య మహిళా మండలి వారు ఎన్నో కార్యక్రమాల ద్వారా అవగాహనను కల్పించారని ఆమె అన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్షయను పారద్రోలడానికి సహాయపడాలని అన్నారు. అనంతరం కంచెర్ల ఉమామహేశ్వరరావు, సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్వైజర్ (యస్.టి.యస్) మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలైన ఆకలి లేకపోవడం, బరువు కోల్పోవడం, రొండు వారాలకు మించి దగ్గు, తరచూ జ్వరం రావడంలోని ఏఒక్కటి ఉన్నా ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంకు గాని గవర్నమెంటు ఆసుపత్రికి గాని వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని, ఒక వేల క్షయ గా నిర్ధారణ అయితే గవర్నమెంటు వారు ఉచితంగా మందులు, ఆరు నెలల పాటు 500 వందల రూపాయలను పోషకాహారం కొరకు ఇస్తారని, కావున క్రమం తప్పకుండా మందులను తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యం. గంగాధర్ రావు టి.బి.హెచ్.వి, వాసవ్య సిబ్బంది కె.శ్రీనివాసరావు, ఎ.సత్య ప్రసాద్, డి.వీరాంజనేయులు, టి. మహాలక్ష్మి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *