Breaking News

మోదీ, జగన్‌ల ప్రజావ్యతిరేక పాలనపై వామపక్షాలు ప్రచార యుద్ధం

-14 నుంచి 30వ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాతలు
-వైసీపీ, టీడీపీ, జనసేన కలిసి రావాలని విజ్ఞప్తి
-బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనను ఎండగడతాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల్ని చైతన్యం చేసేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి రోజైన ఏఫ్రిల్‌ 14 నుంచి 30వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం ప్రచార యుద్ధం చేయనున్నట్లు ఆయా పార్టీల నేతలు తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో శుక్రవారం సీపీఐ, సీపీఎం సంయుక్తంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ప్రమాదకర ధోరణి కనిపిస్తుందన్నారు. పార్లమెంట్‌ అంటే గౌరవం లేకుండా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదాని విషయంలో ప్రపంచ దేశాలు చర్చిస్తుంటే ప్రధాని ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. 20 రోజులుగా జరిగిన పార్లమెంట్‌ సమావేశంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయకుండా అవినీతిపరులకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. క్రోని క్యాపిటలిజంతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి షేర్‌ హోల్డర్లను దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు అదానినీ ఉపయోగించుకుని ప్రధాని స్థాయికి ఎదిగారని ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నారని చెప్పారు. 9ఏళ్ల మోదీ పాలనలో కార్పోరేట్‌లకు సంపద పెంచారని తెలిపారు. దేశంలో అవినీతి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఎవరైనా నిలదీస్తే వారిపై ఈడీతో దాడులు చేస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీయేనని చెప్పారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాలలో బ్లాక్‌ మనీని వెనక్కు తీసుకురావటం, ఉద్యోగాల భర్తీ, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, రామాయపట్నం పోర్టు నిర్మాణం, విశాఖ రైల్వే జోన్‌ వంటి అంశాలలో ఒక్కటీ కూడా అమలు చేయలేదన్నారు.
దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మోదీకి లొంగుబాటు ప్రదర్శిస్తుందన్నారు. దేశంలో మోదీ , అదానీ, జగన్‌ హావా నడుస్తుందన్నారు. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన భూముల్ని అదానీకి ధారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పోర్టులు, ఆదాయాన్ని సమకూర్చే సంస్థల్ని కట్టబెడుతున్నారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు రూ.30వేల కోట్ల నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మించకపోతే సాగునీరు ఎలా వస్తుందని, ఆయకట్టు స్థిరీకరణ ఎలా సాధ్యమవుతుందన్నారు.జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరానికి నిధులు మంజూరు చేయకుండా కేంద్ర జలవనరుల కమీషన్‌ అనుమతి లేని ఎగువ భద్ర ప్రాజెక్టుకు నిధులు ఎలా కేటాయించారని నిలదీశారు. ఇలా ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోదీ, జగన్‌ల పాలనకు వ్యతిరేకంగా వామపక్షాలు సమరభేరి మోగిస్తుందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 16రోజుల పాటు వివిధ రూపాల్లో జరిగి ఈ ప్రచార జాతాల్లో ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాలు, లౌకిక వాదులు, ప్రజలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించరు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిధులు ఇవ్వరు. ఎప్పుడో నిర్ణయించిన అంచనాలను పదేపదే సవరిస్తూ వాటినే మళ్లీమళ్లీ చెపుతున్నా సీఎం జగన్‌ ప్రశ్నించటం లేదన్నారు. ఎన్నిసార్లు ఢల్లీి వెళ్లినా రాష్ట్ర ప్రజాయోజనాల కోసం ఒక్క వినతి పత్రం కూడా ఇవ్వలేదన్నారు. ట్రూఅప్‌ చార్జీల పేరుతో వేలకోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపట్ల ఏమైనా గౌరవం ఉంటే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. బీజేపీకి కొమ్ముకాస్తే అది తెలుగు ప్రజలకు అవమానం అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నా లౌకిక పార్టీలుగా చెప్పుకునే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరుమెదపటం లేదన్నారు. లోక్‌సభలో 22 మంది ఎంపీలు, రాజ్యభలో 8 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ ఎందుకు మోదీ ముందుకు మోకరిల్లటం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ విలువల్ని కాలరాస్తున్న మోదీ, జగన్‌ల పాలనకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం పార్టీలు చేస్తున్న ప్రచార ఉద్యమంలో టీడీపీ. వైసీపీ, జనసేన పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌.బాబూరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *