Breaking News

మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల పరిశీలన,

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ శనివారం క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. న్యూ రాజరాజేశ్వరీ పేట ప్రాంతములో రైల్వే లైను వెంబడి వన్ టౌన్ నుండి వచ్చు మురుగు నీటి ప్రవాహమునకు రైల్వే డిపార్ట్మెంట్ వారు మూడవ ట్రాక్ నిర్మాణ పనులలో భాగముగా అడ్డుకట్టలు వేసియున్నందున వన్ టౌన్, పాత రాజరాజేశ్వరి పేట ముంపునకు గురిఅవుచున్నవి. న్యూ రాజరాజశ్వరి పేట రైల్వే గేటు నుండి సుబ్బరాజునగర్ వరకు కమిషనరు పర్యటించి అడ్డుకట్టలు వెంటనే తొలగించవలసినదిగా ఆదేశించినారు. ప్రధాన డ్రైయిను ప్రవాహమునకు ఆటంకముగా ఉన్నా ఆక్రమణలు తొలగించవలసినదిగా ఆదేశించియున్నారు. రైల్వే డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రవాహమునకు ఆటంకము లేకుండా చేయమని ఆదేశించియున్నారు. ప్రస్తుతము ఉన్న మట్టి కాలువ స్థానములో ఆర్.సి.సి కాలువ నిర్మాణమునకు ఎస్టిమేషన్ (అంచనా ఖర్చులు) తయారుచేయవలసినదిగా ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, నారాయణమూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, అశోక్ రైల్వే ఎ.డి.ఇ.ఎన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *