Breaking News

మహిళలకు ఆర్థిక చేయూత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజక వర్గ సర్కిల్-3 పరిధిలో గల 9 మరియు 14 డివిజన్లులో దర్శిపేట నందు ఆసరా సంబరాల కార్యక్రమమును విజయవాడ నగరపాలక సంస్థ పీ.ఓ.యు.సి.డి వారు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిధులుగా యన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ డిల్లి రావు ఐ.ఏ.ఎస్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజక వర్గ YSRCP ఇంచార్జి దేవినేని అవినాష్ పాల్గొనడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఆర్థిక చేయూత. అందించుటకు ప్రభుత్వం ది.11-04-2019 నాటికి ఉన్న స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఋణాలు అప్పు నిల్వ మొత్తం సొమ్మును 4 విడతలలో నేరుగా వారి సంఘాల పొదుపు ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2 విడతల ఆసరా సొమ్ము నేరుగా వారి సంఘాల పొదుపు ఖాతాలకు జమ చేసినారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి 3వ విడత YSR ఆసరా అమౌంట్ ను మంజూరు చేసినారు. విజయవాడ నగరపాలక సంస్థ తూర్పు నియోజక వర్గ పరిధిలోని 9 మరియు 14 డివిజన్లులో ఆసరా సంబరాలలో భాగముగా దర్శిపేట నందు మొత్తం 357 సంఘాల లోని 3,562 మంది డ్వాక్రా మహిళలకు రూ.4,41,01,589 జమ చేసినారు. ఈ కార్యక్రమము నందు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 14 వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, SHG సభ్యులు, CDO, CO, WWDS మరియు RP లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *