Breaking News

వేసవి దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాల పని సమయాలు మార్పు..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాల పని సమయాలను మార్పు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకుని జిల్లా శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఫ్రీ స్కూల్‌ కార్యకలాపాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సమయాలను మార్పు చేయాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సోమవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. 04.04.2023 నుండి 31.05.2023 వరకు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్చడం జరిగిందన్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత పిల్లలను వారి వారి ఇంటికి పంపించవచ్చునని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాల పని వేలల మార్పులను గమనించి చిన్నారులను ఉదయం 8 గంటలకే అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *