Breaking News

మహిళాల సంక్షేమం వైసీపీ ప్రభుత్వం తోనే సాధ్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇస్తున్న ప్రాధాన్యత తో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారని,మహిళ సంక్షేమం వైసీపీ తోనే సాధ్యమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రాణిగారితోట సిమెంట్ గౌడౌన్ నందు జరిగిన 3వ విడత వైయస్సార్ ఆసరా వారోత్సవాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ 17,18 డివిజన్ల పరిధిలోని 350 గ్రూపు లకు మంజూరు అయిన 2 కోట్ల 95 లక్షల 45వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లో ప్రతి మహిళా సంతోషంగా ఉండలని,వారు ఆర్థికంగా బలంగా తయారవ్వాలనందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆకాంక్ష అని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూసేది అని, వారి బాగోగులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వారికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వడంతో పాటు, 50 శాతం నామినేటెడ్ పదవులు కేటాయించారని అన్నారు. అదేవిధంగా ప్రతి సంక్షేమ పధకంలో వారికి నేరుగా సంక్షేమ లబ్ది అందించడమతో పాటు, ఇంటి స్థలాన్ని కూడా వారి పేరు మీద యజమానులను చేసారని అన్నారు.ప్రతి మహిళా కూడా జగనన్న ను వారి సొంత కుటుంబ సభ్యుడిలా భావించి ఆదరిస్తున్నారు అన్నారు. మహిళలు అంత కూడా ముక్త కంఠంతో మరలా జగనన్న నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకొంటూ మరింత అభివృద్ధి చెందాలని అవినాష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 18వ డివిజన్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, ఏపీ నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్నేటి సుజాత, దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు బచ్చు మాధవి, 17,18 డివిజన్ అధ్యక్షులు కాశీ, బిక్షాలు రెడ్డి, ఆయా డివిజన్ల ముఖ్య నాయకులు,కార్యకర్తలు డివిజన్ నాయుకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *