Breaking News

ఘనంగా బి.జె.పి 44వ ఆవిర్భావ దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతాపార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం గురువారం విజయవాడలోని పార్టీ బి జే పి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 1980 ఏప్రిల్‌ 6 పార్టీ ఆవిర్భావం జరిగింది. అదే సమయంలో బి.జే.పి యువ మోర్చా ప్రకాశం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ నిమ్మరాజు చలపతిరావుతో పాటు ఆ నాటి ప్రముఖులు పలువురిని సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జి కెవి.లక్ష్మీపతి రాజా, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు బబ్బూరి రామ్‌, సీనియర్‌ నేత డా॥దాసం ఉమామహేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *