విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2019 ఎన్నికలకు ముందు పాదయాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. అన్నీ వర్గాల వారి కష్టాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నవరత్నాలను వారి కోసం రూపొందించినారు. ఎన్నికలకు ముందుగా చెప్పిన వాగ్ధానాలను అధికారంలోని వచ్చిన తరువాత నూటి నూరు శాతం నెరవేర్చారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కానీ ఈ రోజుకు ఎక్కడా కూడా వెనుకడుగు వేయడం లేదు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం 2014 ఎన్నికలకు ముందు చేసిన డ్వాక్రా రుణమాఫీ, రైతులను రుణమాఫీ. ఇంటికో ఉద్యోగం లాంటి 200లకుపైగా వాగ్ధానాలను చేసి అధికారంలోకి రాగానే వాటిని గాలికి వదిలేశారు. మాట మీద నిలబడలేని చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జగన్ మోహాన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేని సంక్షేమ పథకాలను జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అమలు చేస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ స్కూల్స్ కు పోటీ పడేలా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ నాడు నేడు కార్యక్రమం అమలు చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేగాకుండా జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి లాంటి పథకాలను అమలు చేయడం ద్వారా విద్యార్ధులకు ఏంతో మేలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుపొందిన టీడీపీ వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఆనందం వారికి ఎంతో కాలం ఉండదు. చంద్రబాబు అండ్ కో.. వాపు చూసి బలుపు అని భ్రమ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ది చెప్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. కేసీఆర్ పై భయంతోనే భ్రమరావతి వైపు అడుగులు వేసి, వేల కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని వృధా చేశారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు డబ్బు ఖర్చు పెడుతుంటే విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి (పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖ) ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News