Breaking News

43వ డివిజన్లో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 43 వ డివిజనులో టిడిపి అధ్యక్షులు దూది బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ పార్క్ సెంటర్ నందు ఇదేం కర్మరా మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటు చెత్త పై పన్ను, రేషన్ కార్డులు సమస్యలు, వృద్ధాప్య పింఛన్లు తొలగిస్తున్నారని ప్రజలు చెప్పుకొని వాపోయారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని డివిజన్ అధ్యక్షులు దూది బ్రహ్మయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కరీముల్లా, కొలికి కొండయ్య, గాలేశా, వెంకట్రావు ,ఎస్ వెంకటేశ్వరరావు ,నరసింహ , వెంకటేశ్వరావు, బొప్పరాజు చెన్నయ్య, వేల్పుల నరసింహ, ఎస్ పాపారావు, శంషాద్ ఖాన్, సాయి, ఎస్ పాపారావు, అప్పన్న, బజార్ శ్రీను, పెన్నావెంకటేశ్వర్లు, మెట్టు శ్రీను, నాలి నాగేశ్వరావు, మర్రి వెంకటేశ్వర్లు, ఝాన్సీ శంభాని, ఈశ్వరమ్మ, రమణమ్మ, రోజా నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాగా ఇన్నాళ్లు స్తబ్దంగా ఉన్న సీనియర్ తెదేపా కార్యకర్తలు బొప్పరాజు చెన్నయ్య, కాటంరాజు, ఎస్ వెంకటేశ్వరరావు లాంటి వారు నేడు ప్రత్యక్షంగా తెదేపా కార్యాచరణలో రావడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా ఇలాగే మరి కొందరు ముందుకు రావాలని దూది బ్రహ్మయ్య పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *