Breaking News

ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే మాసం రంజాన్… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే మాసం రంజాన్ అని దేవినేని అవినాష్ అన్నారు. రంజాన్ మాసపు సందర్భంగా 2వ డివిజన్,హిలల్ మోస్క్యూ మసీదు లో జరిగే ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలసి నమాజ్ లో పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో దైవ చింతన తో నెల రోజుల పాటు నియమబద్ధ జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ, ఓర్పు, సానుభూతి, సేవాభావం వంటి సద్గుణాలు అలవడడంతోపాటు జీవితంలో ఎలాంటి కఠిన పరీక్షలనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిస్వాసం పెంపొందుతుందన్నారు. శుభాలు వర్షించే వరాల వసంతం రంజాన్ అని ఆయన అన్నారు. ఈ సంధర్బంగా దేవినేని అవినాష్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ వైస్ చైర్మన్ సుభాని,కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ మీర్ హుస్సేన్,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మొయిన్, మసీదు కమిటీ షరీఫ్,ఖాదర్,ఇక్బాల్,హకీమ్,అంజుమ్,బాజీ,అలీ,హుస్సేన్,అహ్మద్ ,తూర్పు కాపు కార్పొషన్ డైరెక్టర్ ఇజ్జడా తేజేష్ వైస్సార్సీపీ నాయకులు రిజ్వాన్ చందాకిరణ్, చోటు,ఫాజిలుద్దీన్, రఫీ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *