– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా.. ప్రజల సంపూర్ణ మద్ధతు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందన్న విషయం మరోసారి తేటతెల్లమైందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వాంబేకాలనీలోని 263వ వార్డు సచివాలయ పరిధి ‘డి’ బ్లాక్ నందు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మూడో రోజు పండుగ వాతావరణంలో కొనసాగింది. సీఎం జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ.. ఇంటి తలుపు, మొబైల్ ఫోన్లకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను అంటించుకునేందుకు లబ్ధిదారులు సంతోషంగా ముందుకు వచ్చారు. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండదండగా నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావులతో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. పార్టీ పంపిన ప్రజామద్ధతు పుస్తకంలోని ఐదు ప్రశ్నలకు ప్రజాభిప్రాయాలు తీసుకున్నారు. గృహ సారథులు ప్రశ్నలు చదివి వినిపించినప్పుడు.. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా జగనన్నే కావాలంటూ సమాధానాలు చెప్పి రసీదు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో కోటి 60 లక్షల కుటుంబాలను కలిసే బృహత్తర కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమానికి మించి ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఈనెల 20 వరకు ఒక మహాయజ్ఞంలా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలందరితో మమేకం అవుతున్నట్లు వివరించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ. 2 లక్షల కోట్లను జమచేసిన ఏకైక నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ప్రతి గడపకూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోసారి జగనన్న ప్రభుత్వానికి తమ ఆశీర్వాదాలు అందించాలని ఈ సందర్భంగా స్థానికులను మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఇస్మాయిల్, గోపి, ఆర్.ఎస్.నాయుడు, రాజా, ఫాతిమా, కుమారమ్మ, సచివాలయ కన్వీనర్లు ఎస్.డి.బాబు, నాగూర్, గృహ సారథులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News