తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతo గా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె. బాలాజీ తో కలసి జిల్లా కలెక్టర్ స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి లు కోదండ రామిరెడ్డి, భాస్కర్ నాయుడు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్ లైన్ నమోదుతో రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ శాఖకు- 96, పోలీస్ శాఖ 9, పంచాయతీరాజ్ 6, హౌసింగ్ 1, డ్వామా 2, డి.ఎం.హెచ్. ఓ 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1, రవాణా శాఖ 2, ఆర్.డబ్ల్యు.ఎస్ 1, ఇరిగేషన్ శాఖ 1, మునిసిపల్ కార్పొరేషన్ 1, ఎస్సీ కార్పొరేషన్ 1, బీసీ వెల్ఫేర్ 1, సర్వే 3, రిజిస్ట్రేషన్ 1 లు కలిపి మొత్తం 127 వినతులు రావడం జరిగిందని జిల్లా అధికారులు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News