Breaking News

అణగారిన వర్గాలే కాదు అగ్రవర్ణ పేదలకు సైతం ప్రభుత్వం అండ..

-అగ్రవర్ణాల పేదల ఆర్థిక బలోపేతానికి వైఎస్సార్‌ ఈబీసీి నేస్తం అమలు..
-జిల్లాలో 19,482 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.29.22 కోట్లు లబ్ధి…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అణగారిన వర్గాలే కాదు అగ్రవర్ణ పేదలను సైతం ఆర్థికంగా బలోపేతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ఈబీసీ నేస్తం పథకమని జిల్లాలో 19,482 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.29.22 కోట్లు లబ్ధి చేకూరుస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు ఆర్ధిక సహాయాన్ని బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ , వెలంపల్లి శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులతో కలిసి కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి వీక్షించి జిల్లాకు చెందిన లబ్దిదారుల ఆర్థిక సహాయపు చెక్‌ను అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే మంజూరు చేయడం జరిగేదన్నారు. ఏ వర్గానికి చెందినవారైనప్పటికి నిరుపేదలను ఆర్థికంగా బలో పేతం అయితే సామాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రవర్ణాలలో నిరుపేదలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ క్షత్రియ, వెలమ వంటి ఓసి సామాజిక వర్గాలకు చెందిన నిరు పేదలకు ప్రతీ ఏడాది 15 వేల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 19,482 మంది మహిళలకు 15 వేల రూపాయల చొప్పున రెండవ విడతగా 29.22 కోట్ల రూపాయల లబ్దిని చేకూరుస్తున్నామన్నారు. ఈబీసీ నేస్తం ఆర్థిక సహాయం అందించడంలో పారదర్శకతను పాటించేందుకు ఆర్థిక సహాయాన్ని నేరుగా మహిళల ఖాతాలలో ముఖ్యమంత్రి జమ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదోక్కుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు లబ్దిదారులకు సూచించారు.ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు, మల్లాది విష్ణు వర్థన్‌ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మన రాష్ట్రంలోనే అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టి అగ్రవర్ణ నిరుపేదలను ఆదుకున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని కొనియాడారు. ి ఈబీసీ నేస్తం ద్వారా అందించే ఆర్థిక సహాయం మహిళల స్వయం ఉపాధికి ఎంతో దోహదపడతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికి పేదలను ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పథకాన్ని క్రమం తప్పకుండా పారదర్శకంగా అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,39,068 మంది పేద మహిళా లబ్దిదారులకు 658.60 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారని శాసనసభ్యులు అన్నారు.
మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో సామానంగా నిలపాలన్నదే ముఖ్యమంత్రి ద్యేయం అన్నారు. వాలంటీర్‌ సచివాలయ ఉద్యోగ నియమాకాలు, నామినేటడ్‌ పోస్టుల బర్తీలో 50 శాతం పైగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు శాసన మండలిలో తొలి సారిగా డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా మహిళలకు అవకాశం ఇచ్చిన ఎకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో మంజూరు చేసిన ఇళ్ళు, ఇళ్ళ స్థలాల పట్టాలను మహిళల పేరునే రిజిస్ట్రేషన్‌ చేసేలా చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రికి అక్కచెల్లెమ్మల పై ఉన్న ప్రేమకు నిదర్శనం అన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ పథకం ద్వారా తల్లి గర్భంలో పిండం నుండి మొదలైన సంక్షేమ పథకాలు మనబడి, నాడు నేడు, స్వేచ్చ, దిశ యాప్‌, కళ్యాణమస్తు, షాదీ తోఫా, వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం, పెన్షన్‌ కానుక, విద్య దీవెన వంటి పథకాలతో మహిళలు ఆనందమైన జీవితాన్ని గడుపుగలుగుతున్నారని శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు ఆవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, కార్పొరేషన్‌ చైర్మన్లు పి. గౌతమ్‌రెడ్డి, కె. గీతాంజలి దేవి, అడపా శేషు, తోలేటి శ్రీకాంత్‌, యం.శివరామకృష్ణ, బండి పుణ్యశీల, బిసి కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె. రాజేంద్రబాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *