Breaking News

ఈనెల 17న ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

-ఇఫ్తార్‌ విందుకు వేదిక కానున్న విద్యాదరపురం స్టేడియం గ్రౌండ్‌ను పరిశీలించిన డిప్యూటీ సియం అంజాద్‌ బాషా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 17వ తేదీన విద్యాదరపురం లేబర్‌ కాలనీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారని ముస్లిం సోదరులు ఇఫ్తార్‌ విందులో హాజరు కావాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ బాషా కోరారు.
నగరంలో ఈనెల 17న ముఖ్యమంత్రి పాల్గొననున్న ఇఫ్తార్‌విందు ఏర్పాట్లు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ బాషా, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి బుధవారం విద్యాదరపురం స్టేడియం గ్రౌండ్‌ను, షాదీ ఖానా గ్రౌండ్‌, పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈనెల 17వ తేది ముస్లిం, మైనార్టీ సోదరులకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఇఫ్తార్‌ విందుకు విద్యాదరపురం స్టేడియం గ్రౌండ్‌ను ఖరారు చేయడం జరిగిందన్నారు. సుమారు 10 నుండి 15 వేల మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యే అవకాశం ఉందని ఇందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కీలకమైన పదవులలో మైనార్టీ వర్గాలకు చెందిన వారిని నియమించి, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ముస్లిం మైనార్టీ సోదరులు ఇఫ్తార్‌ విందును జరుపుకునేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. 17వ తేదీ స్టేడియంలో నిర్వహించే ఇఫ్తార్‌ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హజరు కానున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ మత పెద్దలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇఫ్తార్‌ విందులో పాల్గొనే వారికి పాస్‌లు అందచేస్తామన్నారు. ఇఫ్తార్‌ విందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ముస్లిమ్‌ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని అంజాద్‌ బాషా కోరారు.ఇఫ్తార్‌ విందు ఏర్పాట్ల స్థల పరిశీలనలో నగర పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, శాసనమండలి సభ్యులు రుహుల్లా, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆడపాశేషు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *