Breaking News

అత్యంత ధనిక ముఖ్యమంత్రులలో జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్… : పోతిన వెంకట మహేష్

-అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 43వ డివిజన్ అధ్యక్షులు జల్లి రమేష్ ఆధ్వర్యంలో ఊర్మిళ నగర్ బ్రహ్మం గారి గుడి వద్దనుండి ప్రారంభించి ఊర్మిళ నగర్ పరిసర ప్రాంతాల్లో లో పర్యటించడం జరిగింది.

మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లడం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా తమ సమస్యలను అనేకం చెప్పుకుంటున్నారని 300 యూనిట్ల కరెంట్ బిల్లు నిబంధన శాకుతో పథకాలు రద్దు చేస్తున్నారు అని, మేము అప్పులు చేసి డబ్బులు కట్టిన ఇంతవరకు టిడ్కో ఇల్లు ఇవ్వలేదని అదేవిధంగా ఈ డివిజన్లో శీను కొట్టు సందులో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆరడుగుల నుంచి యెనిమిది అడుగుల రోడ్లే అని ఇక్కడ డ్రైనేజీ నీటిపారుదల లేక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని, గోతులు తవ్వేసిన రోడ్లకి మరమ్మతులు చేయించడం లేదని, నీటిపారుదల లేక దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని సాయంత్రం 6 దాటితే ఇళ్లతలుపులు మూసేసుకునే పరిస్థితి అని ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మహిళలందరూ ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి కి అవకాశం ఇస్తే మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నిత్యవసర ధరలు విద్యుత్ ఛార్జీలు పెట్రోల్,గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు గానీ, ఉద్యోగ అవకాశాలు గాని, ఆదాయం గాని పెరగలేదని ప్రతి మహిళల ఆవేదన వ్యక్తం చేశారని మహిళలందరూ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడతామని చెప్తున్నారని పెద్ద ఎత్తున మహిళల నుండి జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందని ఈసారి మార్పు రావడం తధ్యమని వైసిపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని, మేము ఇంటింటికి తిరుగుతుంటే ప్రజల నుండి వచ్చే స్పందన బట్టి అర్థమవుతుందని అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించడం లో స్థానిక కార్ప్ రేటర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం చెందారు అని ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల పరిష్కరించడంలో జనసేన ప్రజల తరఫున అండగా నిలబడి పోరాటం చేస్తామని తప్పకుండా ఇళ్లపట్టాల పంపిణీ మరియు టిడ్కో ఇల్లు ఇప్పించే విషయంలో జనసేన పార్టీ పోరాటం చేస్తుందని త్వరలోనే కార్పొరేషన్ ముట్టడి ఏ విధంగా చేయాలో మా కార్యాచరణ 17 తారీకు తర్వాత తెలియజేస్తామని అదే విధంగా ఈ రోజు దేశంలోనే జగన్ మోహన్ రెడ్డి ధనిక ముఖ్య మంత్రి అని దీనికి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి కి కంగ్రాట్స్ cm sir అని చెప్పాలని, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆదాయం మొత్తం కలుపుకున్న జగన్మోహన్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపోవడం లేదని, 29 రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తులు మొత్తం కలిపి లెక్క వేసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ముందు దిగదుడిపేనని, జగన్మోహన్ రెడ్డి ఒక్కరి ఆస్తే ఇంతుంటే ఆయన భార్య పిల్లల యొక్క ఆస్తులు ఆయన బినామీల యొక్క ఆస్తులు ఇంకా ఎన్ని వేల కోట్లు ఉంటదో మనం అందరం అర్థం చేసుకోవాలని, ఇంత ధనికుడైన జగన్మోహన్ రెడ్డి నాకు అంగ బలం లేదని, అర్థ బలం లేదని హాస్యస్పద మాటలు మాట్లాడుతున్నాడని, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు చూసి మోడీ కూడా ఆశ్చర్యపోతున్నారని దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రులలో జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలబెట్టారని రాష్ట్రo అప్పు పది లక్షల కోట్లు దాటిపోయిందని ఇటువంటి వైట్ కలర్ నేరస్తులకి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని పేద సామాన్య ప్రజలకి కౌలు రైతులకు ఈ రోజు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్  సంపాదించిన డబ్బుల్లో కోట్ల రూపాయల కౌలు రైతులుకు ఆర్థిక సాయం మా నాయకుడు చేస్తున్నారని మరి జగన్ మోహన్ రెడ్డి ఒక్క కౌలు రైతుకు కూడా ఎక్కడా కూడా పదివేల రూపాయలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు

డివిజన్ నాయకురాలు ఆలమూరు శ్రీదేవి మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. సమస్యలు పరిష్కరించడంలో స్థానిక కార్పొరేటర్ పూర్తిగా వైఫల్యం చెందారు కనీసం కాలవల్లో మురుగు తీయించలేనని దుస్థితి దోమలు బెడద తీవ్రంగా ఉంది పగిలిపోయిన రోడ్లను మరమ్మత్తులు చేయించకపోవడం వలన చాలామందికి దెబ్బలు తగులుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనన్నారు. ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత అడుగడుగునా స్పష్టంగా కనబడుతుందని రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం తరఫున పోతిని మహేష్ గారు చాలా సునాయాసంగా గెలుస్తారని ఎవరు ఎన్ని కుట్రలో కుయుక్తులు కుతంత్రాలు చేసిన సంపూర్ణ మహిళా మద్దతు అవన్నీ తిప్పికొడతామని హెచ్చరించారు.

42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ ఎవరో ప్రజలకి తెలియదని వాలంటీర్ ను కార్పొరేటర్ అనుకుంటున్నారని . క్రాoబె రోడ్డుకు ఖుద్ధుస్ నామకరణం చేయాలని కాని 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం క్రాoబె ను రోడ్డును ఖుద్ధుస్ రోడ్డుగా కాకుండా వేరొక పేరు ప్రతిపాదిస్తున్నారని దీన్ని జనసేన పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాంమని ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడతామని . క్రాoబె రోడ్డుకు ఖుద్ధుస్ రోడ్డు గా నామకరణం చెయ్యకపోతే వారు ముమ్మాటికీ ముస్లిం మైనారిటీ ద్రోహులే అన్నారు . డివిజన్ స్థానిక నాయకులు m శ్రీను, డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, రెడ్డిపల్లి గంగాధర్ ,కొరగంజి వెంకటరమణ, బత్తుల వెంకటేష్, బొమ్ము రాంబాబు , కోరాకుల సురేష్ ,సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి , తిరుపతి అనూష, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, వెన్న శివశంకర్ , స్టాలిన్ శంకర్, పాల రజిని, బోట్టా సాయి తదితరులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *