Breaking News

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్ష

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రశాంతంగా నిర్వహించిన్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు గొల్లపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించిన్నట్లు తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదు ఫ్లైయింగ్‌ స్కాడ్‌లను, పరీక్ష కేంద్రాలలో 1,354 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తుని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రాత్రి వేళలో విద్యుత్‌ సరఫరా చేసేలా విద్యుత్‌ అధికారులకు ఆదేశించామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు. పరీక్ష కేంద్రాలలోనికి విద్యార్థులు ఎటువంటి మొబైల్‌ ఫోన్‌లను, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించకుండా అన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కట్టదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు దోహదపడిరదన్నారు. 19వ తేది నుండి 26వ తేది వరకు బిషప్‌ అజరయ్య పాఠశాలలో స్పాట్‌ వాల్యేషన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్‌ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు ఛీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏపిఆర్‌టిసి అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *