Breaking News

జగనన్న పాలన పట్ల ప్రజలు సంతృప్తి ఇంటింట సర్వేలో వెల్లడి డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపట్ల ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నారని ఇంటింటా సర్వేలో స్పష్టమవుతోందని ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తన పని తీరుపై తానే ప్రజాభిప్రాయం సేకరించేందుకు సర్వే చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు 15 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ పోల్ నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 60 లక్షలు కుటుంబాలు ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది వైకాపా కుటుంబ సభ్యులైన సచివాలయం కన్వీనర్లు గృహ సారధులు ఇంటింటికి వెళ్లి ఈ సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో ఇప్పటికే 47 లక్షల కుటుంబాలు వైకాపా కేంద్ర కార్యాలయానికి 8296082960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి వైకాపా ప్రభుత్వానికి తమ మద్దతును తెలియజేశారన్నారు. దీనిని బట్టి జగనన్న సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. గత వారం రోజులుగా కన్వీనర్లు గృహసారథులు వాలంటీర్లు సర్వే నిమిత్తం ఇంటింటికి వెళుతుంటే ఆయా కుటుంబాలు ఎదురు వచ్చి ఎంతో సంతోషంగా వైకాపా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పథకాలతో తాము పొందిన లబ్ధిని ప్రజలే చెబుతుంటే ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం అంటూ ప్రజలు ఏకీభవిస్తున్నారన్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఈ రీతిన తమ పాలన పై తామే సర్వే చేసుకున్న సందర్భం లేదన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు మేలు జరిగింది కాబట్టి ఎంతో ధైర్యంగా వైకాపా ప్రభుత్వం సాహసంతో ఈ సర్వే చేపట్టిందన్నారు. దళారులు ప్రమేయం లేకుండానే వాలంటీర్ల ద్వారా ముఖ్యమంత్రి బటన్ నొక్కి డి బి టి పద్ధతిలో నేరుగా పథకాల లబ్ధిదారులకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నారు. వైకాపా పాలనను ముఖ్యమంత్రి జగన్ ను వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని ఇదే ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి కొనసాగితేనే తమ కుటుంబాలు బాగుంటాయని ప్రజలే స్వయంగా ఈ సర్వేలో చెప్పడం ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. దీనిని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీ లు తప్పుడు ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ప్రజలే వాటిని తిప్పి కొడతారు అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలకు కనీసం పశ్చాత్తాపం లేకపోవడం విచారకరమన్నారు ఇప్పటికీ మోసపూరితంగా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని దీనిని ప్రజలు సహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ నెల 21 తో సర్వే ముగుస్తుందని అనంతరం నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను ప్రజల సంతృప్తిని బహిరంగంగా ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ 45 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18 750 రూపాయలు వైయస్సార్ చేయూత ద్వారా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని కొనసాగించుకుంటామని మహిళలు స్వయంగా సర్వేలో చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. సృష్టించిన దేవుడు మర్చిపోవచ్చు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ నమ్మి ఓటు వేసిన జగనన్న మాత్రం జనాన్ని మరిచిపోడని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అభివర్ణించారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు మండల కన్వీనర్ ముప్పిడి సంపత్ కుమార్ పట్టణ కన్వీనర్లు కొలుకులూరి ధర్మరాజు కర్రి భాస్కర రావు వైకాపా నాయకులు బొద్దాని శ్రీనివాస్ మానుకొండ వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *