Breaking News

డిప్యూటీ సీఎం కొట్టు ఉదారత మృతుడు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం

తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తన ఉదారతను చాటుకున్నా రు. తాడేపల్లిగూడెం మండలం దండగర్ర పంచాయితీ పరిధిలోని లింగారాయుడుగూడెం గ్రామంలో కొద్దిరోజుల క్రితం వీరమల్ల ఆది కృష్ణ అనే యువకుడు దుర్మరణానికి గురయ్యాడు. ఇతని మరణానికి దారి తీసిన పరిస్థితులు చాలా విచారకరమని మంత్రి కొట్టు పేర్కొన్నారు. ఆ యువకుడి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో తాను కూడా సహాయపడాలని లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నానన్నారు. ఈ మొత్తాన్ని శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మృతుడు ఆది కృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి 1,80,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఆవేశ కావేశాలకు పోయి పరస్పరం రెచ్చగొట్టుకోవద్దని డిప్యూటీ సీఎం కొట్టు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు మండల కన్వీనర్ ముప్పిడి సంపత్ కుమార్ పార్టీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు కర్రి భాస్కరరావు ఏలూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు దండగర్ర వైకాపా నాయకులు పెద్దబ్బులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *