విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు భవానిపురంలోని మసీదే రజా వీధిలోని మసీదు వద్ద వేలాది మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఐజా గ్రూప్ చైర్మన్, జనసేన నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ (ఐజా) చెప్పారు. శనివారం భవానిపురం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నామని వివరించారు. ఇఫ్తార్ విందులో పెద్ద ఎత్తున పాల్గొవాలని ముస్లిం సోదరులకు ఐజా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఇఫ్తార్ విందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో నిష్టగా అల్లాహ్ ను ప్రార్థించడం జరుగుతుందని చెప్పారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఐజా పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News