Breaking News

రహదార్లు అందంగా తీర్చిదిద్దండి…

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
-క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా అధికారులతో కలసి 17 వ తేదిన విధ్యాదరపురం బైపాస్ రోడ్డు నందు గల స్టేడియం లో నిర్వహింస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమము ఏర్పాట్లను ఆదివారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారధి దగ్గర నుండి విధ్యాదరపురం బైపాస్ రోడ్డు నందు గల స్టేడియం దాకా రోడ్ల ఏర్పాట్ల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇస్తూ, పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్.టి.సి వర్క్ షాప్ రోడ్ లో రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేసిన మొక్కలను పరిశీలించి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేసించినారు. విధ్యాదరపురం స్టేడియం చుట్టూ ఉన్న పారిశుధ్య నిర్వహణ విధానము ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ గారు స్టేడియం జరుగుతున్న పనుల గురించి పోలీసు డిపార్టుమెంటు వారిని అడగాగా వారు నగరపాలక సంస్థ వారు చేస్తున్న పనులకు సంతృప్తి చెందినట్లు తెలిపినారు. పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, పోలీసు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *