విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo కార్యక్రమం 50వ డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ జోడు బొమ్మల సెంటర్, RCM school వద్దనుండి ప్రారంభించి కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది
మీడియా పాయింట్ వద్ద పోతిన మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జోడు బొమ్మల సెంటర్, RCM school వద్దనుండి ప్రారంభించి కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగిందఅని, ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలను అనేకం చెప్పడం జరిగిందని ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బతకడం కష్టంగా ఉందని ఈ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందని, ఏదో చేస్తాడు అనుకుని ఆయనకు ఓటు వేస్తే మా జీవితాలు పాతాళంలోకి వెళ్లిపోయాయని, బ్రతకడం చాలా కష్టంగా ఉందని మా సమస్యలను చెప్పుకోలేకపోతున్నామని, ఎన్నడూ లేనటువంటి దుర్భర పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూస్తున్నామఅని జగన్మోహన్ రెడ్డి పాలన మాకు వద్దని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారని, ముఖ్యంగా మహిళలైతే మాకు పథకాలు ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, ఒక చేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు గుంజేస్తున్నాడు అని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం మాకు వద్దని చెప్తున్నారని, జగన్మోహన్ రెడ్డి అమ్మిచ్చే మద్యం తాగి మా మగవాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారని, మా ఇళ్ళ ముందే పడి దొర్లుతున్నారని, ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు మాకొద్దు తక్షణమే మద్యం షాపులు రద్దు చేయించాలని, జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం చేయిస్తానని చెప్పి పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు చేయిస్తున్నారని, ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మాకొద్దని మహిళలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి రేపు ఇఫ్తార్ విందు ఇవ్వడానికి అనర్హుడని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో రేపు ఇఫ్తార్ విందు ఇచ్చే ప్రదేశంలో గత 15 ఏళ్లుగా స్టేడియం నిర్మాణం చేస్తామని ఇప్పటివరకు దాదాపుగా ఒక 10,15 సార్లు శంకుస్థాపన రాళ్లు వేసి ఉంటారని ముఖ్యంగా మేమైతే అక్కడ స్టేడియం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని అక్కడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సామాన్య,పేద, మధ్యతరగతి ప్రజలకు గృహ సముదాయాలు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నామని దానితో పాటుగా అదే ప్రాంతానికి చెందినటువంటి సితార కి ఎదురుగా ఉన్నటువంటి కార్మిక శాఖకు సంబంధించినటువంటి దాదాపు 200 గజాల స్థలంలో వంగవీటి మోహన రంగా గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు అని కానీ ఈరోజు అక్కడ వైసీపీ కార్యాలయాన్ని కట్టుకోవడానికి సంవత్సరానికి కేవలం 1000 రూపాయల లీజుతో 33 సంవత్సరాలు కేటాయించడం కూడా మేము నిరసిస్తున్నామని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇవ్వడానికి వస్తున్నారా లేకపోతే కార్మిక శాఖకు సంబంధించిన 200 గజాల స్థలాన్ని కొట్టేసి వైసిపి కార్యాలయం చూసుకోవడానికి వస్తున్నారో సమాధానం చెప్పాలని, క్రాంబే రోడ్డుకి ఖుద్దూస్ నగర్ రోడ్డుగా నామకరణం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని క్రాంబే రోడ్డుకి వేరే పేరు గనుక ప్రతిపాదిస్తే మీరు ముస్లిం మైనార్టీల ద్రోహులు అవుతారని వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసిందేమీ లేదని, ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వటానికి అనర్హులు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని , పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారని ముఖ్యంగా ఇసుక పాలసీ మీద, రాజధాని అమరావతి మీద అదే విధంగా జాబ్ క్యాలెండర్, గోతులు పడ్డ రోడ్లమీద ఈ విధంగా అనేక సమస్యల మీద పోరాటం చేయడంతో పాటుగా కౌవులు రైతులకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక్కరేనని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలి సంక్షేమం కూడా ఈ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందాలి అంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారని మేము కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఎట్టి పరిస్థితిలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ మాట్లాడుతూ కొండ ప్రాంతంలో ఉన్న ఇళ్లకు పట్టాలిస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ చేశారని ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా హామీ పత్రాలు ఇచ్చి ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వెళ్లి పోవాలని రౌడీయిజం చేస్తున్నారని వెల్లంపల్లి ఇంటి వైపు వస్తే తలుపులు మూసేసి చీకుడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో తప్పక పోతిన వెంకట మహేష్ ను జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ పై గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని, మీరెన్ని నాటకాలు అడినా డ్రామాలాడిన వె ల్లంపల్లి శ్రీనివాస్ పని అయిపోయిందని సీఎం జగన్ స్వయంగా రంగంలో దిగిన మీ ఓటమి తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మద్దెల కనకారావు, మొబీనా, నరేష్,డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, ,కొరగంజి వెంకటరమణ, బొమ్ము రాంబాబు, కోరాకుల సురేష్, సిగానంశెట్టి రాము, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్, కమల సోమనాదం,వెన్న శివశంకర్ , పాల రజిని, బోట్టా సాయి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News