Breaking News

రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి తానేటి వనిత

– కొవ్వూరు నియోజకవర్గంలో రూ.1080.59 లక్షల అంచనా వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులు..
– రూ.534.59 లక్షల వ్యయంతో 6 మార్గాల్లో పురోగతి దశలో రోడ్డు అభివృద్ధి పనులు..
– వివరాలను వెల్లడించిన హోం మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ (APRRP) కింద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) ఆర్థిక సాయంతో 1080.59 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్ల అభవృద్ధి నిర్మాణ పనులు  జరుగుతున్నాయని రాష్ట్ర హోం మంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల్లో భాగంగా ఇప్పటికే 534.59 లక్షల రూపాయల వ్యయంతో 15.39 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. మరో 526 లక్షల రూపాయల వ్యయంతో 14.80 కిలోమీటర్ల రోడ్డు పనులకు టెండర్లు ఖరారు కావాల్సి ఉందని హోం మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాళ్లపూడి మండలంలో పెద్దేవం నుండి చిడిపి వరకు 42.44 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 1.22 కిలో మీటర్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే తిరుగుడు మెట్ట నుండి అన్నదేవరపేట వరకు రూ.68.83 లక్షల అంచనా వ్యయంతో 1.94 కిలోమీటర్లు, మలకపల్లి నుండి తిరుగుడు మెట్ట వరకు రూ. 134.55 లక్షల వ్యయంతో 4.23 కిలోమీటర్లు, అఖండ గోదావరి రివర్ బ్యాంక్ (AGRB) నుండి బల్లిపాడు వరకు రూ.35.19 లక్షల అంచనా వ్యయంతో ఒక కిలోమీటర్ రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టారన్నారు. చాగల్లు మండలంలో ఉనగట్ల నుండి అమ్మికుంట వరకు గల మూడు కిలోమీటర్ల రోడ్డును రూ.103.5 లక్షల అంచనా వ్యయంతో ప్రారంభించగా, చాగల్లు నుండి రాళ్ళమడుగు బ్రిడ్జి మీదుగా కాపవరం వరకు రూ.150.08 లక్షల అంచనా వ్యయంతో 4 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. కొవ్వూరు మండలంలో రూ.526 లక్షల అంచనా వ్యయంతో 9 మార్గాల్లో గల 14.80 కిలో మీటర్ల రోడ్డు అభివృద్ధి పనులకు కూడా వేగంగా టెండర్లు ఖరారు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి తానేటి వనిత ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *