Breaking News

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా, తాడిగడపలోని వసంతనగర్‌లో డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ పాల్గొని సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిచారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నిలిచారని, ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఆయన నాలుగు దశాబ్దాల పాటు- ఉపాధ్యా వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారని, ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి సర్వేపల్లి అన్నారు. కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారని, ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదేని, అలాంటి బోధనావృత్తికి తలమానికంగా నిలిచారని, అధ్యాపకుడిగా, వైస్‌ ఛాన్సలర్‌గా, దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం అని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జబీర్‌, సుబాని, రహంతుల్లా మరియు చిన్నారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *